మోదీ-3 సర్కార్‌ ఆర్థిక బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటుందా?

పబ్లిక్‌ పాలసీ థింక్‌ బ్యాంక్‌ తక్షశిల సంస్థ కో-ఫౌండర్‌ నితిన్‌ పాయ్‌ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ  మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం  సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం.  కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే  ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు నిండిన వారిలో నిరుద్యోగ రేటు 4.2 శాతం నుంచి 3.1 శాతం తగ్గింది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నా, అభివృద్ది చెందుతుందనుకుంటున్న ఎకానమీ మాత్రం ఆశించిన రేటులో ఉద్యోగాల కల్పన చేయడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతో నిరాశా నిస్పృహ  పెరుగుతోంది. నిరుద్యోగ తీవ్రత వల్లనే కేంద్రంలో బీజేపీ ఆశలు అడియాశలయ్యాయా? బీజేపీ టార్గెట్ ను అందుకోలేకపోయింది. 240 సీట్లతో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  గత పది సంవత్సరాల్లో ఉన్నవారు, లేని వారి మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగింది. గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సంగతి  తెలిసిందే.  దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశ సంపదలో 40 శాతం వారి వద్దనే ఉంది. 50 శాతం మంది వద్ద కేవలం 6.4 శాతం సంపద ఉంది.  

  • గ్రామీణ రంగంలో బుసలు కొడుతున్న నిరుద్యోగం
  •  అందుకే 240కు  పరిమితమైన బీజేపీ బలం

దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. గుంటూరులో ఒక నవ యువకుడికి చిన్నప్పటి నుంచి పెద్ద యంత్రాలను చూడాలని, ఫ్యాక్టరీ నడపాలనే కోరిక ఉండేది. పేదవాడైన ఆ యువకుడు ఆఖరికి  ఇంజనీర్‌ అయ్యారు. కాని ఉద్యోగం లేదు. మిర్చియార్డులో  ఉద్యోగం దొరికింది. పదివేల రూపాయల వేతనంతో తిరగాలి. ఆయనకు ఉన్నదంతా ఒక ద్విచక్ర వాహనం మాత్రమే. నిరంతరం అసంతృప్తి,  విసుగు, మాంద్యంతో ఆ యువకుడు బాధపడేవారు. ఇటువంటి వారే మన దేశంలో ఏ ఊరికి వెళ్లినా కనపడతారు. నిరుద్యోగ సమస్య  తీవ్రతను ఈ సంఘటన సూచిస్తుంది. పబ్లిక్‌ పాలసీ థింక్‌ బ్యాంక్‌ తక్షశిల సంస్థ కో-ఫౌండర్‌ నితిన్‌ పాయ్‌ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ  మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం  సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి.

ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం.  కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే  ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు నిండిన వారిలో నిరుద్యోగ రేటు 4.2 శాతం నుంచి 3.1 శాతం తగ్గింది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నా, అభివృద్ది చెందుతుందనుకుంటున్న ఎకానమీ మాత్రం ఆశించిన రేటులో ఉద్యోగాల కల్పన చేయడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతో నిరాశా నిస్పృహ  పెరుగుతోంది. నిరుద్యోగ తీవ్రత వల్లనే కేంద్రంలో బీజేపీ ఆశలు అడియాశలయ్యాయా? బీజేపీ టార్గెట్ ను అందుకోలేకపోయింది. 240 సీట్లతో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  గత పది సంవత్సరాల్లో ఉన్నవారు, లేని వారి మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగింది. గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సంగతి  తెలిసిందే.  దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశ సంపదలో 40 శాతం వారి వద్దనే ఉంది. 50 శాతం మంది వద్ద కేవలం 6.4 శాతం సంపద ఉంది.

మధ్యతరగతిలో కూడా అనేక అంతరాలు ఉన్నాయి. దేశంలో కారు తయారీ దారుల వ్యాపారం పెరిగింది. ద్విచక్ర వాహనాల తయారీ దారుల పరిశ్రమ కంటే కార్ల వ్యాపారం పెరిగింది. కొరోనా తర్వాత దేశంలో వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వ అనుకూల వాదుల అభిప్రాయాలను విశ్లేషిస్తే గత పదేళ్లలో 248 మిలియన్ల మందిని దార్రిద్య రేఖ దిగువ నుంచి బయటకు తీసుకువొచ్చామంటున్నారు. కొంత మంది ఎకనామిస్టులు ఏమంటున్నారంటే, పెట్టుబడి వినియోగం పెరిగింది. ఈ ఖర్చు వల్ల దేశంలో ఎకానమీ పెరిగింది. అభివృద్ది వేగంగా చోటు చేసుకుంది. సంక్షేమ రంగంపై ఖర్చు తగినంతగానే చేసినా, ఆ ఫలాల డెలివరీ మెరుగుపడింది. సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుడికి చేరేటట్లు చేశారని బీజేపీ ఆర్థిక నిపుణులంటున్నారు.

జీఎస్టీ వల్ల  ఆర్ధిక రంగం పుంజుకుందని బీజేపీ నిపుణులంటే , ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. నిజంగా ఆర్థిక రంగం మెరుగుపడితే బీజేపీకి 240 సీట్లకే పరిమితమవుతుందా ? ఆర్థిక రంగ ఫలితాలు దిగువ స్థాయిలో ఉండేవారికి చేరాలి. కాని అలా జరగలేదు. ఆర్థిక  రంగ ఫలాలు అట్టడగు వర్గాల వరకు వెళ్లలేదు. లేకపోతే నిరుద్యోగ సమస్య ఎందుకు తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక రంగం అభివృద్ధి చెందిందనే వాదన అభూతకల్పన. అన్ని వర్గాలకు ఎకానమీ అభివృద్ధి చెందిందంటే దాని ఫలాలు చేరాలి. ఉద్యోగాల కల్పన లేకుండా ఎకనామీ ఫలాలు సామాన్యవర్గాలకు  ఎలా చేరినట్లుగా భావించాలి.  కనీనవేతనాల కంటే మెరుగైన వేతనాలు ఇచ్చే విధంగా ఉద్యోగాలు ఉండాలన్న సామాన్యుడి కోరికలు నెరవేరలేదు. అందుకే బీజేపీకి షాకిచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. తప్పని సరిగా ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకోవాలి. విశాల దృక్పథంతో, అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునే విధంగా ఆర్థిక ఫలాలు ఉండాలి. మూడోసారి కూడా ఎన్డీఏ  ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాని సామాన్యుడి మేలు చేసే విధంగా ఆర్థిక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని బీజేపీ  గ్రహించాలి. 885 వృద్దిరేటు లేకుండా సమానత్వ సాధన ఎండమావి లాంటిది. సమానత్వం లేకుండా వృద్ది రేటు  ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేదని ఆర్ధిక రంగ నివుణులు సీ రంగరాజన్‌ గతంలోనే చెప్పారు.
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ లాంటి ఆర్ధిక నిపుణులు చెప్పిన అంశాలు అక్షర సత్యాలు. జీడీపీ వృద్దిరేటు 7 శాతం వరకు 2022-23లో నమోదు కాగా, 8.2 శాతం మేర 2023-24లో నమోదైంది. కోవిడ్‌ తర్వాత భారీ ఎత్తున పెట్టుబడి ఖర్చు వల్ల జీడీపీ  వృద్దిరేటు  నమోదైంది. 2024-25లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 3 ట్రిలియన్లు ఉండగా, 2024-25 611.11 (టిలియన్లకు చేరుకుంది ఎగుమతులు పెరిగాయి. ప్రయివేట్ రంగం విస్తరించడం వల్ల జీడీపీ వృద్దిరేటు బాగానే నమోదైంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఈ సారి ఆయన అనుకున్నంతగా సులభంగా ఆర్థిక రంగం పరుగులు పెడుతుందా? గతంలో మాదిరిగా జీడీపీ రేటు పరుగులు పెడుతుందా ? ఆర్థిక రంగ నిపుణులు రంగరాజన్‌ చెప్పినట్లుగా 2024-25లో జీడీపీ 7 శాతం నమోదైతే  గొప్ప. వృద్దిరేటు క్షీణించకుండా ఉంటే చాలనే పరిస్థితులున్నాయి. మరో సుప్రసిద్ధ ఆర్ధిక రంగ నిపుణులు మాధవి ఆరోరా అంచనా ప్రకారం జీడీపీ 6.5 శాతం నమోదవుతుంది.

ఆర్థిక రంగ నిపుణులు మూడోతరం ఆర్థిక సంస్కణలను ప్రవేశపెట్టాలంటున్నారు. కాని సంకీర్ణ ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకురాగలదా ? మూడవ తరం సంస్కరణలను తీసుకువొచ్చే పరిస్థితులు  కేంద్రంలో ఉన్నాయా… ఆర్ధిక సంస్కరణలను తీసుకువచ్చే పరిస్థితులు  ఇప్పట్లో సాధ్యం  కాకపోవొచ్చు. ఇండియా రేటింగ్స్‌ ప్రిన్సిపల్‌ ఎకనామిస్టు  సీనియర్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ సిన్హా మాట్లాడుతూ ఎకనామీ రంగం జోరందుకునేందుకు సంస్కరణలను తేవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆయన అంచనా ప్రకారం ఆర్ధిక సంస్కరణలు, న్యాయపరమైన వివాదాల పరిష్కార ప్రక్రియ వేగవంతం, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేయడం తదితర అంశాలపై దృష్టిని సారిస్తే మార్కెట్లో ఫండ్స్  ప్రవాహం వేగవంతమవుతుంది.

భారత్‌లో ఫార్మల్‌ సెక్టార్‌ (బ్యాంకులు, పరిశ్రమలు) వల్ల పెద్దగా ఉద్యోగాల కల్పన జరగలేదు. అసంఘటిత రంగంలోనే ఎక్కువగా ఉపాధి కల్పన జరిగింది. వ్యవసాయరంగం చూస్తే 92 శాతం ఉపాధి లభిస్తోంది. అయితే ఇదంతా అసంఘటితరంగం కిందకే వస్తుంది. పరిశ్రమలు, సేవా రంగంలో 73 శాతం ఉద్యోగాలు లభించినా, ఇవన్నీ దిగువ  తరగతికి చెందినవిగా భావింవొచ్చును. మొత్తం ఉద్యోగ రంగంలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కల్పన 27 శాతం మాత్రమే.
బీజేపీ ఆర్థిక విధానాలను చూస్తే పరిశ్రమలు, సేవా రంగాన్ని విస్తరించడం ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించవొచ్చని భావిస్తోంది. కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ  వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఊపందుకోలేదు. దీనికి తోడు కొరోనా వల్ల ఈ రంగం చితికిపోయింది. గ్రామీణ రంగంలో పెద్ద ఎత్తున యువతలో నిరాశా నిస్పృహ చోటు చేసుకుంది.
 ఈ అసంతృప్తిని మోదీ -3  సర్కార్  పారదోలుతుందా ? ఆర్థిక రంగం పటిష్టతకు, నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందా? వొచ్చే నెలలో కొత్త బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ తర్వాత మాత్రమే దేశ ఆర్ధిక స్థితిని అంచనా వేయగలం. జీడీపీలో 0.4 శాతం మేర అంటే 2.1 ట్రిలియన్ల రూపాయల మేర రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రాయితీని ప్రకటించింది. కేంద్రం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటుందా? కొత్త బడ్జెట్‌ వొస్తే కానీ  ఎన్డీఏ  సర్కార్‌ ఆలోచనా విధానాలు, ఆర్దిక విధానాల కొనసాగింపు గురించి ఒక నిర్ణయానికి రాగలం. ఈ విధానాలే రానున్న ఐదేళ్ల ఆర్ధిక నడకను శాసిస్తాయి. మోదీ ప్రభుత్వం కొత్త ఆర్థిక బ్లూ ప్రింట్‌ను రూపొందించుకుని ముందుకు కదలాలని తాజా ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. బీజేపీకి సొంత మెజార్టీ లేదు. సంకీర్ణ  ప్రభుత్వంలోని పార్టీల తోడ్పాటుతో ఆర్థిక రంగం పటిష్టతకు నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సి ఉంటుంది.
-ఎన్ .మాధవన్ 
ది మింట్ సౌజన్యం తో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *