మిషన్‌ ‌భగీరథ చీఫ్‌ ఆర్కిటెక్ట్ ‌కేసీఆర్‌ ..!

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 17వ రోజు మిషన్‌ ‌భగీరథ విజయోత్సవం

ఉమ్మడి రాష్ట్రంలో చక్కని కృష్ణమ్మ చెంతనే పారు తున్నా…ఒకచుక్క మంచినీరు దక్కని దుస్థితి నల్లగొండ జిల్లా ప్రాంతంలో దాపురించింది. ఫ్లోరైడ్‌ ‌మహామ్మారి ఏటా వేలమందిని వికలాంగులను చేసింది. వంకర్లు తిరిగిన మనుషులను, వంగిపోయిన జీవితాలను చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమనేతగా ఫ్లోరైడ్‌ ‌పీడ విరగ్గొట్టే విధంగా ఏలా విముక్తి కల్పించాలో నాడు ఉద్యమ సమయంలోనే ఆలోచించారు. అధికారంలోకి రాగానే మిషన్‌ ‌భగీరథ పథకానికి రూపకల్పన చేసారు. ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు పూర్తి బాధ్యతలు కేటీఆర్‌కు అప్పజెప్పినారు. ప్రభుత్వం అందిస్తున్న సురక్షిత మంచినీరుతో ఫ్లోరైడ్‌ ‌శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2016లో అత్యధికంగా 1.5 పీపీఎం కంటే అత్యధికంగా ఉండగా 2020 వరకు విషపు నీటి నుంచి విముక్తి లబించింది. దాహం తీర్చుకోవడానికి నీరు గొంతులో పోసుకుంటే గరళమై బొక్కలను పెళుసు చేసిన మహమ్మారి మటుమాయమైంది. స్వరాష్ట్రంలో జలస్పూర్తితో ప్లోరైడ్‌ ‌రక్కసిని తెలంగాణ పోలిమేరల్లో లేకుండా పారదోలారు. యువనేత కేటీఆర్‌ ‌వ్యూహంలోనూ, కార్యచరణలోనూ 100 శాతం అమలు, సఫలీకృతం చేసి, మిషన్‌ ‌భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీరు అందించడం గగనమే అన్న వాండ్ల నోరు మూపించినారు. నాడు యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని చవిచూసిన జీవితాల్లో మిషన్‌ ‌భగీరథ అందించిన శుద్ధమైన నీటితో తిరిగి యవ్వన శోభ కన్పించే విధంగా వెలుగు నింపి, ఆచరణాత్మకంగా నిలిచిన ఈ పథకం అమలుతో  కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్లోరైడ్‌ ‌కేసు నమోదు కాకపోవడం కేసీఆర్‌ ‌చిత్తశుద్ధికి నిలువెత్తు తార్కాణం.

నా తెలంగాణ..కోటి రత్నాల వీణలో ఇంటింటికి త్రాగునీరు అందించాలన్న కేసీఆర్‌ ‌సంకల్పతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భృహత్తరమైన ప్రాజెక్టు మిషన్‌ ‌భగీరథ. నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. తెలంగాణలో ప్రతి గడప దాహార్తి తీర్చేందుకు చేసే భగీరథ ప్రయత్నం. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలనే ఏకైక లక్ష్యంతో అహర్నిషలు శ్రమిస్తూ ..ప్రజలకు తినడానికి తిండి, త్రాగడానికి నీరు, నిలువ నీడ లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అసంతృప్తితో వుండకూడదన్న ఓకే ఒక ఆలోచనతో ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తూ ఆర్థికభారం అయినప్పటికీ పూర్తిచేసి బంగారు తెలంగాణ దిశగా ముందకు సాగారు. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురై, దేహాలను పిప్పిచేసిన ఫ్లోరైడ్‌ ‌వ్యాధి బారిన పడ్డ నీలగిరి బిడ్డ లేచి నిలబడుతున్నాడంటే అది ప్రభుత్వం అందించిన శుద్ధమైన నీటి వల్లనే సాధ్యమైంది. రాష్ట్రంలోని 23968 గ్రామీణ ఆవాసాలకు, 120 పట్టణ కేంద్రాలకు శుద్ధినీరు అందించి ప్రభుత్వం ఆశయం ముందు ఆర్థిక సమస్యలు బలాదూరేనని మరోసారి ఋజువు చేసింది. తెలంగాణను ముందుబాగంలో నిలపడంలో మిషన్‌ ‌భగీరథ ప్రధాన భూమిక పోషించి, అందరి మన్ననలు పొందింది. తొమ్మిదేండ్లుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, కీర్తినీ ప్రపంచానికి చాటినందుకు కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంఘటనలు కొకొల్లలు ఉన్నాయి. 2016లో శ్రీకారం చుట్టి  కేవలం మూడు సంవత్సరాలలో పూర్తి చేసింది. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని అనేక జిల్లాలో ప్లోరైడ్‌ ‌రక్కసిని జయించింది. ఒక చట్రంలో చూసినప్పుడు కేసీఆర్‌ ‌కనిపిస్తాడు కానీ, అవతల కనిపించని చట్రం యువనేత కేటీఆర్‌ అనేది నిర్వీవాదాంశం.

సీఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో 1996లో సమగ్ర తాగునీటి పథకం ద్వారా ప్రజలందరికి ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగునీరు అందించిన మానవాతవాది. అదే స్పూర్తితో మిషన్‌ ‌భగీరథకు మూహుర్తం చేసి, ఇప్పుడు యావత్‌ ‌దేశానికే ఆదర్శంగా నిలిచారు. పేద, ధనిక భేదం లేకుండా అన్ని గృహలకు సంతృప్తికరమైన రీతిలో నీరు ఇవ్వాలన్న దూరదృష్టితో, ఈ సమగ్రమైన ప్రాజెక్ట్ ‌స్థాపించి అందరి మన్ననలు పొందిన  దార్శనికుడు కేసీఆర్‌ ‌వ్యూహంలోనూ, కార్యచరణలోనూ 100 శాతం అమలు చేసి సఫలీకృతం చేసి, మిషన్‌ ‌భగీరథ పథకం ద్వారా విజయం సాధించి, రక్షిత మంచినీరు అందించడం గగనమే అన్న వాండ్లకు చేతలతో నోరు మూపించినారు. కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో కేటీఆర్‌ ‌విజన్‌, ‌సంకల్ప బలం, మానుషధర్మాల పట్ల, అచంచలమైన విశ్వాసం ఉన్న నాయకుడు, క్షేత్రస్థాయిలో అపర భగీరథునిలా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక ఇంటికి 100 ఎల్పిసిడి, మున్సిపాల్టీ మరియు  నగర పంచాయతీలలో 135 ఎల్పిసిడి, మున్సిపల్‌  ‌కార్పొరేషన్లలో 150 ఎల్పిసిడి కేటాయింపులు చేయడం, అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు మొత్తం నీటిలో 10 శాతం కేటాయించబడింది. ఈ పథకం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించింది, ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. దేశంలో ఏ పెద్ద రాష్ట్రంలో లేని విధంగా 54.38 లక్షల గృహాలకు నల్లాల ద్వారా ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అందరికి త్రాగునీరు అందించాలనే కేసీఆర్‌ అలోచనను భిన్న పార్శ్యాల డైనమిజం గల కార్యనిర్వాహకుడు కేటీఆర్‌ ‌చిత్తశుద్దితో అమలు చేయడంవల్లనే తెలంగాణ ప్రశంసలు పొందింది.
కేసీఆర్‌ ‌మార్గదర్శకంలో కేటీఆర్‌ ఆలోచన ప్రతిరూపం భగీరథ. మిషన్‌ ‌భగీరథ సక్సెస్‌ ‌కోసం తన ఆలోచనను అన్నీతానై ప్రాజెక్టుపై లోతుగా అధ్యయనం చేసి తనకంటూ ఒక విజన్‌ ‌వుందని, ప్రతిపక్షాల సవాళ్ళు మన సహనాన్ని పరీక్షించినా తనకు లేరు ఏవరు సాటి అన్న రీతిగా సజీవంగా సంయమనం లక్ష్యం చేరింది. ఆయన శక్తిని జనకయంత్రంగా మార్చి  ఉన్న విజయ తీరాన్ని ముద్దాడింది. లక్షల కిలో మీటర్ల పైప్‌ ‌లైన్‌ ‌పూర్తిచేసుటకు ఎన్నో సర్వీసు క్రాసింగుల అధిగమించాల్సి వచ్చింది. అసలే ఐటీ మరియు సాంకేతిక రంగంలో దిట్ట అయిన కేటీఆర్‌ ‌తనదైన శైలీలో ఇంటింటికీ త్రాగునీరు అందించాలనే ఒక కసి, పట్టుదల ఆయన విజయానికి నాంది పలికింది. ఫ్లో కంట్రోల్‌ ‌వాల్వ్‌ను తెలంగాణలో తోలిసారిగా మిషన్‌ ‌భగీరథకు వాడిన సాంకేతికతను చూసి ఆశ్చర్యం కల్గుతుంది. పైపు లైన్‌ ‌ద్వారా నిమిషానికి 5 లీటర్ల నీళ్ళు మాత్రమే వెళ్ళుతాయి. ఒక వేళ మోటారుతో తోడుకోవాలని ప్రయత్నించినా  అదనంగా ఒక బొట్టు కూడా రాకుండా నియంత్రిస్తుంది. అదే మన పురపాలకశాఖ మరియు ఐటి శాఖ మాత్యులకు సాంకేతిక రంగంలో వున్న అనుభవం. మిషన్‌ ‌భగీరథ సక్సెస్‌ ‌పట్టుదలకు అద్దం పట్టింది. తన ఉనికిని తానే నిలబెట్టుకొని, మహా వృక్షంలా నిటారుగా నిలబడి అందరికీ నీడనివ్వాలనుకోవడం అరుదైన వ్యక్తిత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కేటీఆర్‌ ‌సొంతం. ఆధునిక రాజకీయాల్లో..కేటీఆర్‌ ఓ ‌మిరాకిల్‌ అని, అద్బుత భవిష్యత్తు ఉన్న నాయకుడని జాతీయ స్థాయిలోనూ ఆర్థిక, వాణిజ్యరంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. శత్రువులు సైతం పనితీరును విశ్వసిస్తున్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌  ‌విస్తరించడమే ఇప్పుడు కేసీఆర్‌ ‌ముందున్న లక్ష్యం.
image.png
డా.సంగని మల్లేశ్వర్‌,
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్‌, 9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *