భంగం తప్పదు సామీ!

ఇప్పుడు విశ్వ గురువు
వింత వాదం చేస్తున్నడు

కలిసున్నోళ్ళ నడుమన
విద్వేషాలు రాజేస్తున్నడు

గోడీ మీడియా ఆసరగా
మత చిచ్చు పెడ్తున్నడు

మరలా అధికారం కోసం
అబద్ధాలు వల్లిస్తున్నడు

ఓయ్ దేశోద్ధారకుడా !
పదేళ్ల మీ ఏలుబడిలో
అధిక  ధరాఘాతాలు
నిరుద్యోగ నిట్టూర్పులు
అభాగ్యుల ఆక్రందనలు
అన్నదాతల అరిగోసలు
కష్టజీవుల కన్నీళ్లు తప్పా
జాతికి ఒరిగింది శూన్యం

డబుల్ ఇంజన్ సర్కారులో
బుల్డోజర్ల బ్రేక్ డ్యాన్సులు
మతోన్మాదుల విన్యాసాలు
చీకటి చట్టాల ప్రయోగాలు
హక్కుల హననం మినహా!
దేశానికి దక్కింది రిక్తహస్తం

ఐనా మీ గళంలో గరళం
దాగుందన్నది ఏరిగినదే

మాటల మాటున పీఠంపై
యావేనన్నది తెలిసినదే

కొంగ జపాలెన్ని చేసినా
నక్క జిత్తులెన్ని పన్నినా
జనగణం నమ్మదు సామీ!
గర్వభంగం తప్పదు సుమీ!!
   కోడిగూటి తిరుపతి
           Mbl no:9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *