భంగం తప్పదు సామీ!

ఇప్పుడు విశ్వ గురువు వింత వాదం చేస్తున్నడు కలిసున్నోళ్ళ నడుమన విద్వేషాలు రాజేస్తున్నడు గోడీ మీడియా ఆసరగా మత చిచ్చు పెడ్తున్నడు మరలా అధికారం కోసం అబద్ధాలు వల్లిస్తున్నడు ఓయ్ దేశోద్ధారకుడా ! పదేళ్ల మీ ఏలుబడిలో అధిక ధరాఘాతాలు నిరుద్యోగ నిట్టూర్పులు అభాగ్యుల ఆక్రందనలు అన్నదాతల అరిగోసలు కష్టజీవుల కన్నీళ్లు తప్పా జాతికి ఒరిగింది…