హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన అటోలో ఎక్కించుకున్నాడు.
ఆపై పక్కవీధిలోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆటో డ్రైవర్ బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.


