జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానంలో తెలంగాణ
41 లక్షల మంది గర్భిణులకు రవాణా సదుపాయం
ఆరోగ్యశ్రీ పరిధిలో 87.50 లక్షల కుటుంబాలు
రూ.92 కోట్లతో హాస్పిటళ్లలో విద్యుత్ సేఫ్టీ పనులు
ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ‘‘ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖాన’’కు అన్నట్లు వుండే ప్రభుత్వ హాస్పిటళ్ల తీరు నేడు పూర్తిగా మారాయి. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న మక్కువతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్బవిస్తున్నది. గత ఎనిమిది ఏండ్లుగా ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యలతో జాతీయ ఆరోగ్య సూచికల్లో 3 వ స్థానానికి చేరుకున్నది. ఆరోగ్య సబ్ సెంటర్ల నుంచి ప్రాథ•మిక, ఏరియా, జిల్లా, భోధన, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం పటిష్టపరిచింది. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు, టెస్ట్‌లను విస్తృతం చేయుటకు వ్యవస్థాపరమైన వసతులను అభివృద్ధి చేసింది. దీనితో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి ఆకాంక్షాలకు అనుగుణంగా పౌరుల ఆరోగ్య స్థితి మెరుగుపడింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ముఖ్య ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి కనిపిస్తున్నది.
రాష్ట్రం ఏర్పడక ముందు 92గా ఉన్న మాతృ మరణాల రేటు(ఎంఎంఆర్), నేడు 56కి తగ్గింది. శిశు మరణాల రేటు(ఐఎంఆర్) 39 నుండి 21 కి తగ్గింది. 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు(యుఎస్‌ఎంఆర్) 41 నుంచి 30కు, నవజాత శిశు మరణాల రేటు(ఎన్‌ఎంఆర్) 25 నుండి 17 కి తగ్గింది. నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆరోగ్య సూచికల్లో దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. కేసీఆర్ కిట్ ద్వారా 2017 నుండి ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. రూ.1,176 కోట్లు డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. 102 రిఫరల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా 41 లక్షల మంది గర్భిణులు రవాణా సదుపాయం పొందారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టి, ఎదిగేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో 99 శాతం లక్ష్యాన్ని సాధించింది. 35 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు(ఎస్‌ఎన్‌సియుటి) ప్రస్తుతం పనిచేస్తున్నాయి. లేబర్ రూమ్‌ల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ల ద్వారా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సరయిన ప్రత్యేక సంరక్షణ సేవలు సకాలంలో అందుబాటులోకి వచ్చాయి.
పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి +•వీ• ప్రాంతంలో 259 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి.బస్తీదవాఖానాలలో 195 రకాల మందులు, 57 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి ఉచిత డయాగ్నోస్టిక్ కేంద్రాలు ద్వారా హబ్ • స్పోక్ మోడల్ కింద రక్త పరీక్షలు, జు•+ మరియు ఎక్స్-రే, ఖ•+ డయాగ్నస్టిక్ సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రస్తుతం 20 జిల్లాల్లో ఈ టెస్ట్ లాబ్స్ ఉన్నాయి. మరో 13 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి నెలా దాదాపు 4 లక్షల శాంపిళ్లను ఈ టెస్ట్ లాబ్స్ లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం హబ్‌లు పాథాలజీ, రేడియాలజీ, వైరాలజీ సేవలను కూడా అందిస్తున్నాయి. వీటితో పాటు సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ప్రభుత్వం విస్తృత పరిచింది. సెకండరీ కేర్‌లో 10,170 పడకలతో 175 ఆసుపత్రులు సెకండరీ హెల్త్ కేర్ సేవలను అందిస్తున్నది.
తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్యవిద్యను ప్రజలకు చేరువచేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేల జిల్లాలకు వైద్య కళాశాల ను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులలో అదనపు వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. తేదీ 18 మే 2021న ఎబి-పిఎంజెఎవై స్కీమ్‌తో ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అనుసంధానించింది. తద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 25 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. తద్వారా 13 లక్షలకు పైగా పేషెంట్స్ లబ్ధిపొందారు. రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్త ‘‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టాయి. ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ విధానంలో భాగంగా డైట్ ఛార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టారు. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనా హాస్పిటళ్లు, 20 జిల్లా హాస్పిటళ్లు, 30 హదీహాస్పిటళ్లు/సిహెచ్‌సి లలో ఎలక్ట్రికల్ సేఫ్టీ పనులు మంజూరు చేయబడ్డాయి. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి.
రూ.61 కోట్లతో 20 హాస్పిటళ్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్‌టిపి) మంజూరు అయ్యాయి. రూ. 31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ పనులు మంజూరయ్యాయి. 61 హాస్పిటల్ మార్చురీల మరమ్మత్తు, పునరుద్ధరణ మరియు అప్‌గ్రేడేషన్ పనులను ప్రభుత్వంచే మంజూరు చేయబడింది. రూ 134 కోట్లతో 20 హాస్పిటళ్ల ఎస్‌టిపి లను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తున్నది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ బహుముఖ చర్యలతో ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగింది.




