ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు
-ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి
-దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించిన మంత్రి
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్
ఈ నెల 17 న నిర్వహించనున్న టీ ఎస్ జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు వున్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికితీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి టీఎస్‌జెన్కో ఏఈ పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారు. అన్ని సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజ్ఞాపనదారుల సౌకర్యార్థం ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రజాదర్బార్ నిర్వహణను జి హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.




