‌ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా.. లేని వ్యక్తికి వోటేస్తారా..నిర్ణయించుకోండి

గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ‌ఘనత కేసీఆర్‌ ‌దే
గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‘‘‌సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా..ప్రజల్లో లేని వ్యక్తికి వోటేస్తారా..మీరే నిర్ణయించుకోండి అని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు మద్యం దుకాణాలకు 15 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత కేసీఆర్‌ ‌దేనని, రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల కోసం 55 కోట్లు ఖర్చు పెట్టామని, మరోసారి కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి, చింతా ప్రభాకర్‌ను ఆశీర్వదించి, గెలిపించాలని రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి కంది సమీపంలోని ఎస్‌ఎస్‌ ‌గార్డెన్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌లో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..రాబోయే కాలంలో సంగారెడ్డి జిల్లాలో కూడా సిద్దిపేట తరహాలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా గీత కార్మికుల కోసం మంచి కన్వెన్షన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామని  తెలిపారు.

అర్హతలు ఉన్న ప్రతి ఒక్క గీత కార్మికునికి ఒక లూనాను…దళిత బంధు, బీసీ బంధు, గీత కార్మికులకు రుణం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక కల్లు దుకాణం ఏర్పాటు చేయాలంటే ఎక్సైజ్‌ ‌శాఖలకు ముడుపులు ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం వొచ్చాక ఎక్సైజ్‌ ‌శాఖకు అటువంటి ముడుపులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఎక్సైజ్‌ ‌శాఖ సిబ్బంది కల్లు దుకాణాల వైపు చూడకుండా మొత్తం ఆన్లైన్లో కల్లు దుకాణాలను రెన్యువల్‌ ‌చేసుకునే విధంగా కేసీఆర్‌ ‌ప్రభుత్వం చొరవ చూసుకుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుకాణాలకు 15 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న గౌడ కులస్తులు అందరూ చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావుతో పాటు సంగారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చింతా ప్రభాకర్‌, ‌తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షుడు లక్ష్మణరావు, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్‌ ‌నాగరాజు గౌడ్‌, ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ‌సంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్‌ ‌కో-ఆర్డినేటర్‌ ‌మాణిక్యంతో పాటు సంగారెడ్డి జిల్లాలో ఉన్న గౌడుల సంఘం అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *