చెయ్యి గుర్తుతో మరోసారి చెయ్యి కలిపిన అగ్గిపెట్టె పార్టీ అగ్గి రాజేయకుండానే పోటీనుండి నిష్క్రమించడాన్ని వీర తెలంగాణ అభిమానులకు మింగుడు పడకుండా ఉంది. కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీ చేయనప్పుడు ఇక రాజకీయ పార్టీగా కొనసాగడం దేనికన్న ప్రశ్న ఎదురవుతున్నది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా ఈసారికి తెలంగాణలో పోటీ లేదంటూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నమాటలు ఇక్కడ గుర్తుకు వొస్తున్నాయి. పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే పోటీ చేయకపోయినా టిడిపి ఎవరికి బహిరంగ మద్దతును ప్రకటించలేదు. కాని, టిజెఎస్ మాత్రం కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించింది. అనేక పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణరాష్ట్రంలో నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయింది అందుకు ప్రజలను చైతన్యపరిచేందుకే తెలంగాణ జనసమితి అవిర్భవించిందని అనాడు చెప్పిన ప్రొఫెసర్ కోదండరామ్, గత పదేళ్ళ కాలంలో చట్టసభల్లో పోరాటం చేసే తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా 2018 ఏర్పడిన మహాకూటమిలో భాగమైన టిజెఎస్ ఆనాడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది. గత ఎన్నికల్లో ఉద్భవించిన దాదాపు పద్నాలుగు పార్టీలకు ఆనాడు ఎన్నికల కమిషన్‌గుర్తులను కేటాయించింది.
అందులో భాగంగా టిజెఎస్‌కు అగ్గిపెట్టె గుర్తును కేటాయి ంచారు. ఈ గుర్తు కేటాయించడంలో ఆలస్యం జరుగటంతో కాంగ్రెస్ పార్టీ తమ చెయ్యిగు ర్తుపైన పోటీ చేయాల్సిందిగా కోరగా కోదండరామ్ తిరస్కరించినప్పుడు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కాస్తా గర్వంగానే ఫీలైనారు. కాని, నాడు నేడు కూడా స్వతంత్రంగా కాకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమ పార్టీ ఉనికి కోల్పోతున్నదని ఆ పార్టీ వర్గాలు ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమితో కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌తో అనేక దఫాలుగా చర్చలు జరుపాల్సి వొచ్చింది. తాము కోరుకున్న స్థానాలనివ్వడానికి ఇబ్బంది పెట్టింది. దాంతో అతి తక్కువ స్థానాలకే టిజెఎస్ పరిమితం కావాల్సి వొచ్చింది. కాంగ్రెస్ స్నేహపూరిత పోటీ అంటూ ఆనాడు టిజెఎస్‌ను ఇబ్బంది పెట్టిన విషయం తెలియందికాదు. 2023 ఎన్నికల విషయంలో కూడా అదే తంతు ఎదురైంది. ఒంటరిగా పోటీ చేసేకన్నా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని టిజెఎస్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీతో ప్రొఫెసర్ కోదం డరామ్ చర్చలు జరిపారు. తెలంగాణరాష్ట్ర సాధనలో కీలక భూమికను పోషించిన కోదండ రామ్ సహకారం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసురాజు, వేం నరేందర్‌రెడ్డి స్వయంగా టిజెఎస్ కార్యాలయానికి వెళ్ళి కోదండరామ్‌తో చర్చించి ఒప్పించుకోగలిగారు.
అందుకు సమ్మతించిన కోదండరామ్ గత విషయాను పక్కకు పెట్టి సీట్ల పంపకాలవంటి రాజకీయ షరతులేవీ లేకుండా స్వచ్చంద మద్దతును ప్రకటించడం కోదండరామ్ అభిమానులనుకూడా ఆశ్చర్యపరిచింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన గత పదేళ్ళుగా ఒంటరి పోరాటం చేస్తున్న టిజెఎస్ అధినేత కోదండరామ్ అంటే తెలంగాణలోని నాలుగుకోట్ల మంది ప్రజలకు వల్లమా లిన అభిమానం. విశ్వాసం. అలాంటి కోదండరామ్ ఒప్పందంలో భాగంగా కొన్ని స్థానా ల్లోనైనా పోటీచేసే విషయంలో పట్టుదలను ప్రదర్శించరకపోవడమేంటన్నది ప్రశ్నగా మిగిలింది. పైగా దింపుడు కళ్ళెం ఆశగా ఇంకా ఎక్కడైన అవకాశం ఏర్పడితే ఆ స్థానాన్ని తమకు కేటాయిం చాల్సిందిగా కోదండరామ్ కాంగ్రెస్ నేతలను కోరినట్లు తెలుస్తున్నది. అందుకు ఇప్పటికే తమ పార్టీలో సీట్ల కేటాయింపు దాదాపు పూర్తి అవడంతో ఇక సీట్ల పొత్తు ప్రశ్నే ఉత్పన్నంకాదని కాంగ్రెస్ నాయకులు మొదటికే తీసిపారేసినట్లు తెలుస్తున్నది.
ఈసారికి పోటీ, సీట్ల కేటాయి ంపుతో సంబంధంలేకుండా స్వచ్ఛందంగా తమకు మద్దతు ఇవ్వాలన్నది కాంగ్రెస్. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడితే అప్పుడు టిజెఎస్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారన్నది వార్త.ఇదిలాఉంటే రాజకీ యమైన డిమాండ్లను పక్కకు పెట్టి ప్రజా సంబంధమైన డిమాండ్లను కాంగ్రెస్ ముందుం చింది టిజెఎస్. తమ మద్దతుకు వాటిని అంగీక రించాల్సిందేనంది టిజెఎస్. అందులో ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌తోనే తెలంగాణ ఏర్పడిన తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updatesవిషయం తెలియందికాదు. ఆ మాటకు వొస్తే టిజెఎస్‌కూడా అదే నినాదంతో ముందుకు పోతున్నది. అందుకే ఉపాధి, ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అర్థికవిధానాల రూపకల్పన ఉండాలని, ప్రతీ సంవత్సరం ఏర్పడిన ఖాలీలను ఆ సంవత్సరమే భర్తీ చేయడంతో పాటు, ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న షరతుపెట్టింది. అలాగే అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలన్నది ఒకటి కాగా, ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి, అమరుల కుటుంబాలకు సమగ్ర సహాయం అందించాలి.
సంప్రదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత కల్పించాలి. చిన్న, సూక్ష్మ కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. వాస్తవం వ్యవసాయ సాగుదారులను గుర్తించాలి. చిన్న. సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రతకు కృషిచేయాలి. అలాగే భూమి పరిరక్షణ చర్యలు చేపట్టాలి. వీటన్నిటితోపాటు ముఖ్యంగా పాలన ప్రజాస్వామ్యవంతంగా ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వ అవినీతిపైన సమగ్ర విచారణ జరిపించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసి, మహిళా, మైనార్టీ, పేదలకు పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని కల్పించాలన్న పలు డిమాండ్‌ల విషయంలో కాంగ్రెస్ అంగీకరిస్తే లక్ష్యాన్ని ముద్దాడే వరకు తమ పార్టీ కాంగ్రెస్‌తోనే ఉంటుందని కోదండరామ్ హామీ ఇవ్వడంతో, గొప్ప ఆశయం కోసం చేస్తున్న పోరాటంలో టిజెఎస్ తమతోకలిసి రావడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీగా పోటీలో లేకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని టిజెఎస్ వర్గాలు వాపోతున్నాయి.
– మండువ రవీందర్‌రావు





