నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

అనంతరం తమిళనాడుకు వెళ్లనున్న మోదీ.. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు మోదీ. రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి సంగారెడ్డి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం ప్రధాని ఒడిశాకు బయల్దేరి వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *