హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు
అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు
సందడిసందడిగా హైటెక్స్ ప్రాంతం
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు
నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్ హైటెక్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ అగ్ర నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యవర్గ సమావేశాలకు వొస్తున్నందున రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒక్కో నేత ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరికి స్వాగతం పలుకుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కొందరు తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. శనివారం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రానున్నారు. శనివారం, ఆదివారం కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్ర పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారు. సమావేశాలకు రెండు రోజుల ముందే రాష్ట్రానికి పలువురు జాతీయ నేతలు చేరుకున్నారు.
దీంతో హైటెక్స్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన నేతలు.. నేరుగా వారికి కేటాయించిన అసెంబ్లీ నియోజకర్గాలకు వెళ్లారు. కొందరు నేతలైతే బుధవారాం రాత్రే హైదరాబాద్ చేరుకొని.. నియోజకవర్గాలకు వెళ్లారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలతో బిజీ అయ్యారు. వీరిలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్టాల్ర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, జాతీయ ఆఫీసు బేరర్లు, జాతీయ అధికార ప్రతినిధులు, పలు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న తరవాత జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్న రాజకీయ, ఆర్థిక అంశాలపై నడ్డా వీరితో చర్చించారు. వేదికవద్ద భరతనాట్యం, శివతాండవం, పేరణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత దరువు ఎల్లన్న నేతృత్వంలోని తెలంగాణ కల్చరల్ పోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం నడ్డా అధ్యక్షతన జరుగనుంది.
నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోడీ..అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నోవాటెల్ కు చేరుకుంటారు. నేడు అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమావేశాల్లో పాల్గొంటారు. నోవాటెల్ లోనే కేటాయించిన ప్రత్యేక సూట్లలో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం సమావేశాల్లో పాల్గొననున్న మోడీ.. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరవుతారు. ప్రధాని మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటున్నందున ఆయన సిటీలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లొచ్చని, పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లే అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇకపోతే నోవాటెల్‌లోని పలు ప్రదేశాలకు రాష్ట్రంలోని పలు చారిత్రాత్మక ప్రాంతాలు, తెలంగాణ యోధుల పేర్లను రాష్ట్ర పార్టీ నాయకత్వం పెట్టింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్ ప్రాంగణానికి శాతవాహన నగర్‌గా, జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్‌కు కాకతీయ ప్రాంగణంగా, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా పేర్లు పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల వి•టింగ్ హాల్‌కు వందేమాతరం రామచంద్రరావు పేరు, వి•డియా పాయింట్‌కు షోయబుల్లాఖాన్ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు పేరు, బీజేపీ ఫుల్ టైమర్ వర్కర్స్ సమావేశానికి కొమురం భీం పేరు, భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నారాయణ పవార్ పేరును పెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను రుచి చూపించాలని పార్టీ నిర్ణయించింది. సకినాలు, గారెలు, అరిసెలు, సర్వపిండి వంటి వంటకాలను మెనూలో చేర్చింది. నోవాటెల్ చెఫ్‌లతో గాకుండా, కరీంనగర్‌కు చెందిన యాదమ్మతో ఈ వంటకాలు చేయిస్తుంది. మూడో తేదీ మధ్యాహ్నం లంచ్‌లో చిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, తోటకూర, బీరకాయ, గంగవాయిలి పప్పు, పప్పు చారు, బగారా వంటకాల రుచి చూపించనుంది. అదే రోజు సాయంత్రం ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా వంటి ప్రముఖులకు సకినాలు, గారెలు, గంజు పిండి తదితర వంటలను స్నాక్స్‌గా అందిస్తుంది. ఈ వి•టింగ్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అతిథులు వొస్తుండడంతో, అన్ని రాష్ట్రాల వంటకాలను మెనూలో ఉంచారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ ఏమేం చేయాలో జాబితా విడుదల చేశారు.



