నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

  • సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన
  • విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్‌ ‌రిజిజు

image.png
న్యూదిల్లీ,జూన్‌ 28: ‌నీట్‌ అం‌శంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.  విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని తాము సభ్యులకు మరోసారి హా ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పదేపదే చెప్పినా సభా కార్యకలపాలకు కాంగ్రెస్‌ ‌సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్‌ ‌రిజిజు పేర్కొన్నారు.

సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు. కాగా, నీట్‌ ‌వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ఎం‌పీ మనీష్‌ ‌తివారీ తప్పుపట్టారు. నీట్‌ ‌ప్రశ్నాపత్రం లీకేజ్‌తో లక్షలాది విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విపక్ష ఇండియా కూటమి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని, ఇక తాను క్రిమినల్‌ ‌చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్‌ ఇచ్చానని మనీష్‌ ‌తివారీ పేర్కొన్నారు. అయితే వీటిపై చర్చ జరగకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

ఇక దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో యువత భవిష్యత్‌ ‌నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎం‌పీ దీపీందర్‌ ‌సింగ్‌ ‌హుడా ఆందోళన వ్యక్తం చేశారు.హరియాణలో అత్యధికంగా పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులు వెలుగుచూశాయని చెప్పారు.నీట్‌ ‌పరీక్ష ప్రశ్నాపత్రం లీకయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంట్‌లో చర్చకు లేవనెత్తితే మైక్‌ను స్విచాఫ్‌ ‌చేశారని మండిపడ్డారు. విపక్ష నేత మైక్‌ను నిలిపివేయడంతో విపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీరును తప్పుపట్టారని చెప్పారు. కీలకమైన నీట్‌ అం‌శంపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *