నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ
 ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌
 సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు

ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని టీ స్టాల్‌ వద్దకు వచ్చిన ఏఐసీసీ నేత ఎంపీ రాహుల్‌ గాంధీ నిరుద్యోగ యువతతో ముచ్చటించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లిక్‌ వ్యవహారంపై చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.

అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ లోని బావర్చి హోటల్లో బిర్యానీ తిన్నారు. రాహుల్‌ సడన్‌ విజిట్‌ తో హోటల్‌ సిబ్బంది అవాక్కయ్యారు. హోటల్‌ మేనూ వివరాలు తెలుసుకుని, కస్టమర్లతో మాట్లాడారు. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. రాహుల్‌ రాకతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్లన్నీ రద్దీగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *