‘‘ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్ జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు అనేక రకాలయిన కారణాలను చూపెడుతూ,వసతులలేమితో ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తుంది.’’
పాఠశాలలు ప్రారంభమై నెలరోజులకు పైగా గడుస్తున్నా ప్రభుత్వం కనీస మౌలిక సౌకర్యాలు కల్పించటంలో ఉధాసిన వైఖరి ప్రదర్శిస్తుంది విద్యార్ధుల నిష్పత్తి ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, సరైన తరగతి గదులు, టాయిలెట్స్, టీచర్లును కల్పించలేదు. ప్రభుత్వం పేర్కొంటున్న గా ప్రభుత్వ పాఠశాలలలో ప్రవేశాలు పెరగలేదు, పైగా ప్రవేశాలు తీసుకున్న విద్యార్ధులు పాఠశాలకు రాకుండా ప్రవర్తిస్తుంది.
విద్యా పరిరక్షణ కమిటీగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పరిశీలించినప్పడు అనేక విషయాలు మా దృష్టిలోకి వచ్చాయి. సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర్లోలోని ప్రభుత్వ పాఠశాలలను చూసినప్పుడు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు మూడు గదులు రేకుల షెడ్ మాత్రమే ఉన్నది. వాళ్ళందరికీ ఇద్దరే ఉపాద్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు ఏ కారణంగానైనా సెలవు పెడితే అంతే సంగతులు. పోనీ ఆ మూడు గదులైన బాగున్నాయయా అంటే అది లేదు. పై కప్పు అంత దారుణంగా ఉంది. ఇప్పుడొస్తున్న వర్షాలకు ఆ విద్యార్థులందరు ఒక దగ్గర ముసురుకోవడం తప్ప కూర్చునే ఛాన్స్ లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర రాజధాని నగరంలోనే ఈ దుస్థితి ఉంటే మారుమూల పల్లెల్లో పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
విద్యార్థులు లేరనే సాకుతో ( రేషనలైజేషన్ పేరుతో) వందల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నా ప్రభుత్వం, విద్యార్థులు వున్న పాఠశాలలకు ఎందుకు సరైన వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదు..? అంటే ప్రభుత్వానికి స్కూల్స్ మూసివేతపైనున్న శ్రద్ద ఆ స్కూల్స్ ను పరిరక్షించడంలో ఎంతమాత్రం లేదని స్పష్టమవుతుంది. అసలు ముందే ప్రభుత్వ స్కూల్స్ లో అన్నిరకాల వసతులు కల్పిస్తే విద్యార్థులు లేరనే సాకు ఉంటుండేనని ఆలోచించవచ్చు. ప్రభుత్వమే టీచింగ్ ,నాన్ టిచింగ్ ,మౌలిక సౌకర్యాలు కల్పించపోవడం మూలంగా, నాణ్యమైన విద్య అందడం లేదని తమలాగే తమ పిల్లలు కష్టాలుపడొద్దనే బలహీనతతో తల్లిదండ్రులు అప్పుచేసి ప్రైవేట్ స్కూల్లోకి తమ పిల్లలను పంపిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. వాస్తవంలో ప్రభుత్వమే విద్యార్థులను ప్రైవేటు స్కూల్స్ లోకి నెట్టుతుందనే అవగతం అవుతుంది. క్రమంగా ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం హామీపడ్డ ఉచిత నిర్బంధ విద్య, ఆచరణ నుండి తప్పుకుంటుంది.ఇది రాజ్యాంగ నియమాల స్పూర్తికి విరుద్ధమైనది.
ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్ జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు అనేక రకాలయిన కారణాలను చూపెడుతూ,వసతులలేమితో ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తుంది. తద్వారా ప్రైవేట్ ,కార్పొరేట్ సంస్థల ఫిజుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు బస్ పాస్ చార్జీల మోతతో ప్రభుత్వ స్కూల్స్ లో చదవలేక, ప్రైవేట్ స్కూల్స్ లో చదివించలేక, తల్లిదండ్రులు, విద్యార్థులు సతమతమవుతు మనోవేదనకు గురవుతున్నారు.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A ప్రకారం ఉచిత నిర్భంద ప్రాథమిక హక్కు ను అందించడంలో ఉద్దేశపూర్వక అలసత్వంన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన వాగ్దానాల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య నా కలంటూ ప్రగల్భాలు పలికి తీరా పదవినెక్కిన తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడం లేదు.మరోవైపు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫిజు రియంబర్స్మెంట్ విడుదల చెయ్యకుండా, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల పెంచకుండా, బస్ పాస్ చార్జీల పెంచి పేద, మధ్యతరగతి జీవులపై భారం మోపుతున్నాడు. ఈ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై విద్యార్థి లోకం గర్జించాలి.
– గడ్డం శ్యామ్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 9908415381




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల