దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి
బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి   జరుగుతోందని చెప్పారు. దిల్లీలో గురువారం ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం వ్నిడియాతో మాట్లాడారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తాం. బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల అధికారులు ఒక బృందంగా నిబద్ధతతో పనిచేస్తాం కిషన్‌రెడ్డి చెప్పారు.  బొగ్గు, గనుల శాఖ మంత్రి తనకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు అప్పగించారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. దేశంలో విద్యుత్‌ లేకుండా, ఏ పని కూడా కాదని.. విద్యుత్‌ కోతల కారణంతో అనేక మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

మోదీ వచ్చిన తర్వాత విద్యుత్‌ కష్టాలు లేవన్నారు. పవర్‌ మినిస్టీ, రైల్వే మినిస్టీ, పర్యావరణ శాఖలకు, బొగ్గు గనుల శాఖకు అనుబంధం ఉందని కిషన్‌ రెడ్డి తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖలను కలుపుకొని ముందుకు వెళ్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మనకు కావాల్సిన బొగ్గును మనం ఉత్పత్తి చేసుకుంటామని వెల్లడిరచారు. ఉపాధి అవకాశాలు పెంచడంపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరం పని చేయాలన్నారు. ప్రధాని మోదీ దేశ ఆకాంక్షలు కోసం ముందుకు వెళుతున్న ఆయనతో పాటు అందరూ నడవాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *