తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం  కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా ఏపీ  నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మలకు కూడా రేవంత్‌ అభినందనలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, రావాల్సిన నిధులపై శక్తివంచన లేకుండా కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *