తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం
హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది
కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది
కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం
త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు
త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది
తుమ్ములూరు హరితోత్సవ సభలో సిఎం కెసిఆర్‌

‌మహేశ్వరం, ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ పచ్చబడదని, ఏడెనిమిది ఏండ్ల నుండి మనందం పట్టుబట్టి, జట్టుకట్టి బీడుబారి పోయిన తెలంగాణకు ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నామని, పచ్చబడడానికి సంకేతంగా ధాన్యం ఉత్పత్తిలో 2014లో మనం పదిహేను, పదహారవ స్థానంలో ఉంటే నేడు భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని, దీంతో పాటు అనేక రంగాల్లో మనం నెంబర్‌ ‌వన్‌గా వెలుగొందుతన్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఆస్తి, సంపదలు ఎంత ఉన్నా పిల్లలకు ఆరోగ్యంగా బతికే పరిస్థితులు ఉండాలని ఉద్బోధించారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వు ఫారెస్ట్ ‌కేంద్రంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కను నాటారు. అనంతరం అకకడ ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ… ఇందిరా పార్కులో ఒకతను ఆక్సిజన్‌ అమ్ముతం కొనుక్కోండి అని అమ్మకానికి పెట్టిండని తెలిపారు.
మనకు భూములు, అడవులు, నీళ్ళు లేవా ? అని సిఎం ప్రశ్నించారు. అడవులను విస్తృతంగా పెంచితే మనకు  అపారమైన ఆక్సిజన్‌ ‌లభిస్తుందని, ఇంతటి అద్భుతమైన పరిస్థితులున్న దేశంలో పాలకులు చాలా భయంకరంగా అడవులను నాశనం చేసి, ఒక మోడువారిన, బీడువారిన ప్రాంతం లాగా తయారు చేశారని మండిపడ్డారు. ఆనాడు తాను హరితహారం గురించి చెప్తే ఎవరికీ అర్థం కాలేదని, అప్పట్లో పిసిసిఎఫ్‌ ఎస్‌బి ఎల్‌ ‌మిశ్రా  నుండి ఇప్పటి పిసిసిఎఫ్‌ ‌డోబ్రియల్‌ ‌వరకు ఒక ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని చేపడితే, అందరూ హాస్యాస్పదంగా భావించారని, ఇది అయ్యేదా, పోయేదా అన్నారని, కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా హరితహారం పై జోకులు వేశారని సిఎం ఈ సందర్భంగా విమర్శించారు. తుమ్మలూరులో తాను సఫారీలో తిరుగుతూ మూడు నాలుగు ఏళ్ళ కిందట పెట్టిన మొక్కలు నేడు పెరిగి పెద్దవై బ్రహ్మాండంగా విస్తరిస్తున్న తీరును చూశానని, ఈ రోజు మరో 250 ఎకరాల వరకు మొక్కలను నాటారని సిఎం అభినందించారు. తెలంగాణలో నేడు 7.7 శాతం పచ్చదనం పెరిగిందని, ఇది మాటలు చెప్తే పెరగదని, తమాషాలు, కథలు చెప్తే కాదని, ఆ దిశగా అటవీ అధికారులు బాగా కృషి చేశారని, అందుకు అందరికంటే ఎక్కువగా గ్రామ సర్పంచుల్ని తాను అభినందిస్తున్నానని తెలిపారు. తాను దీనిపై చట్టం తెచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా తన మీద కొంచెం కోపం వొచ్చిందని, కానీ నేడు ఆ చట్టం స్ఫూర్తితోనే గ్రామలు పచ్చగున్నాయని అన్నారు. ‘దారులన్నీ పూల తేరులై పోయినయ్‌’ అని ఈ మధ్య ఒక కవి పాట రాశాడని, రోడ్ల మీద పోతుంటే ఎటు చూసినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయని, రంగుల రంగుల పూలతోని తెలంగాణ వీధులు అందంగా ఉన్నాయని కవి తన పాటలో చెప్పిండని, ఇది వట్టిగా జరిగేది కాదని సిఎం వివరించారు.
image.png
దాసర్ల పల్లెలో తనకు పదిహేను ఎకరాల ఉండగా 20 బోర్లు వేయాల్సి వొచ్చిందని, సన్నగా పోసే బోర్లతో కష్టాలు పడ్డామని, ఆ బాధ వర్ణనాతీతమని, తెలంగాణలో ఇప్పుడు ఈ బాధలన్నీ చాలా వరకు తీరిపోయినయని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తి కావాల్సిందని, రిజర్వాయర్లన్నీ కట్టినమని, ఆగష్టులో వాటిని నింపుకోబోతున్నామని తెలిపారు. అయితే ప్రాజెక్టు ఆలస్యానికి దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు సుప్రీమ్‌ ‌కోర్టుకు పోయి స్టే తెచ్చి పనులు ఆగేట్టు చేయడమే రారణమని, ఈ విషయం ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా భగవంతుని దయ వల్ల ప్రాజెక్టు పనులు దాదాపు 85 శాతం పూర్తయ్యాయని, మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్‌, ‌చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్ళు తెచ్చే బాధ్యత తనదని, మీ బిడ్డగా హామీ ఇస్తున్నానని ప్రజలకు తెలిపారు. సాథనిక ఎంఎల్‌ఏ ‌కిషన్‌ ‌రెడ్డి ప్రతీసారి ఇక్కడి నీటి కష్టాలను తనదృషికి తెచ్చేవాడని, రాబోయే మూడు నాలుగు నెలల్లో  మార్పును చూడబోతున్నారని తెలిపారు సిఎం. మీకో తీపి కబురు చెప్తున్నానని, కృష్ణా నదిలో నీళ్ళ కోసం పంచాయితీ ఉంది కానీ గోదావరి నదికి సంబంధించి ఈ పంచాయితీ లేదని, గోదావరి నీళ్ళు మన హిమాయత్‌ ‌సాగర్‌, ‌గండిపేట వరకు లింక్‌ ‌కాబోతున్నాయని, అక్కడి నుండి చిన్న లిఫ్ట్ ‌పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చే అవకాశం ఉందని సిఎం తెలిపారు. కిందనే కొండపోచమ్మ సాగర్‌ ‌నుండి మూసీ నది నీళ్ళు దాటిస్తే నీళ్ళు దాదాపు లోయపల్లి దాకా వొచ్చే అవకాశముందని, ఈ పరిస్థితులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని, కృష్ణలో నీళ్ళు తక్కువబడినా, గోదావరి నది నుండైన ఇచ్చి ఈ ప్రాజెక్టును ఆదుకోవాలనే చర్చ జరుగుతున్నదని, రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి నీటిని తెస్తా అని, చింతించాల్సిన అవసరం లేదని సిఎం భరోసా ఇచ్చారు.
image.png
వానలు వాపస్‌ ‌రావలె…కోతులు వాపస్‌ ‌పోవాలే అనే పాట నేనే రాశా…
ఇక తాను ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలో అటవీశాఖతో రివ్యూ పెట్టానని, బీడుబారిన భూములు, నీళ్ళ కరువు ఇలా చాలా కష్టపరిస్థితులుండేవని, దానిపై వానలు వాపస్‌ ‌రావలె..కోతులు వాపస్‌ ‌పోవాలే అనే పాట కూడా తాను రాశానని, పచ్చని అడవులున్నట్లయితే కోతులు ఊర్లకు రావని, మనం అనుభవించే కోతుల బాధ కూడా తెలుసని అన్నారు సిఎం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని తెచ్చామని, కానీ తాను ప్రారంభించిన కార్యక్రమం ఫలితాలు నేడు తుమ్మలూరులో కనబడుతున్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా తెలంగాణలో దారుల సుందరీకరణతో పాటు రిజర్వు ఫారెస్టులు పెరిగాయని, గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కిందని, దీన్ని కొనసాగించాలని, అందుకు అదనంగా కావాలంటే నిధులు కూడా అందజేస్తామని తెలిపారు. బతకడానికి అనువైన పర్యావరణ పరిస్థితులు కల్పించడం కూడా మన తరం బాధ్యత అని, హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగామని, అటవీ శాఖ అధికారులందరినీ తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు.
పచ్చదనాన్ని పెంపొందించడంలో రెండు దేశాలు గొప్ప ప్రయత్నాలు చేశాయని, చైనా దేశంలోని గోబి ఎడారి విస్తరణను అరికట్టేందుకు ఈ దేశ ప్రజలు పట్టుబట్టి 500 కోట్ల మొక్కలు నాటారని, తగ్గుతున్న పచ్చదనాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్‌ ‌దేశంలో 300 కోట్ల మొక్కలు నాటి ఫలితాలు సాధించారని వివరించారు సిఎం కెసిఆర్‌. ‌నేడు తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలను ఇప్పటికే నాటామని, చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నామని, ప్రతీ ఊరిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు వాటిలొ ఓపెన్‌ ‌జిమ్‌ ‌లున్నాయని, అర్బన్‌ ‌పార్కులు గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నామని, ఇప్పటికే 170 అర్బన్‌ ‌పార్కులు పూర్తయ్యాయని, ఇంకా రూపుదిద్దుకొంటున్నాయని, ఇది మనందరి సమష్టి విజయమని, తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్‌ ‌పెట్టమని తాను చీఫ్‌ ‌సెక్రటరీతో చెప్పాని, ఇది కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్లను కూడా నెరవేరుస్తామని, మహేశ్వరం నియోజకవర్గానికి ఒక మెడికల్‌ ‌కాలేజీని మంజూరు చేస్తామని, తుమ్మలూరు సబ్‌ ‌స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తామని, వీలయినంత త్వరగా పూర్తి చేస్తామని సిఎం తెలిపారు. మెట్రోని విస్తరించమనే డిమాండ్‌ ‌దృష్ట్యా మహేశ్వరానికి మెట్రో తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోట్లాడుతుంటే మీకు వ్యవసాయం చేయడం కూడా మేమే నేర్పినమని, మీకు అన్నం తినుడు కూడా మేమే నేర్పినం అన్నారు.
image.png
ధాన్యం ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడవ స్థానానికి పోయారని సిఎం ఎద్దేవా చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తుమ్మలూరుకు 1 కోటి రూపాయలతోని కమ్యూనిటి హాల్‌ను మంజూరు చేస్తున్నానని, దీనికి ‘దశాబ్ది కమ్యూనిటి హాల్‌’ అని పేరు పెట్టమని తాను కోరుతున్నానని తెలిపారు. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపాడని, కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌ ‌భార్యకు నియామక ఉత్తర్వు అందేజేశామని, మనిషినైతే తేలేం కానీ, కొన్ని డబ్బులు కూడా అందించామని తెలిపారు. అయితే ఇక ముందు ఫారెస్‌  ‌సిబ్బందికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్‌ ‌స్టేషన్లతో పాటు సాయుధ సాయం కూడా అందిస్తామని 20 వరకు స్టేషన్లు అవసరమవుతాయని చెప్పారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో బ్రహ్మండమైన ఫల వృక్షాలను ప్రజలు పెంచుకోవాలని సిఎం ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం  కార్యదర్శి భూపాల్‌ ‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, ‌పిసిసిఎఫ్‌ ‌రాకేష్‌ ‌మోహన్‌ ‌డోబ్రియాల్‌ ‌తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేశారు.
ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ ‌శ్రీనివాస రావు భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత
అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ ‌బండి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకుంటామని తను చేసిన ప్రకటనలో భాగంగా ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అందించిన నేపథ్యంలో సోమవారం నాటి సమావేశ వేదిక మీద బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి, డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగ నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు అందచేశారు. తద్వారా అటవీ శాఖ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటుందనే సందేశాన్ని సీఎం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *