తగ్గుముఖం పట్టిన గోదావరి

  • మూడవ ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న వరద
  • పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు –
  • సాధారణ స్థితి పరిస్థితి వచ్చేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : వారం రోజులకుపైగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి కాస్త పెరిగినప్పటికి మంగళవారం ఉదయం నుండి తగ్గుముఖం పట్టింది. 71.4 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ మంగళవారం సాయంత్రానికి 50 అడుగులు చేరుకుంది. దీనితో మూడవ ప్రమాద హెచ్చరిక దిగువన గోదావరి వరద పారుతుంది. మూడవ ప్రమాద హెచ్చరికకు గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికి అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను విరమించుకోవడం లేదు. 29వ తేది వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి వరద మళ్ళీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలను విరమింపచేయటం లేదని కలెక్టర్‌ అనుదీప్‌ ‌వెల్లడించారు.
సాధారణ పరిస్థితిలు నెలకొనేంత వరకు ముంపు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే కొనసాగించేల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద ప్రభావం తగ్గిన కాలనీల్లో యుద్దప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇండ్లలోకి వరదనీరు చేరుకోవడం వలన గోడలు తడిచి విద్యుత్‌ ‌షాక్‌ ‌వచ్చే ప్రమాదం ఉన్నందున కొన్ని కాలనీలు విద్యుత్‌ను పునరుద్దరించలేదు. ఇప్పుడిప్పుడే రహదారులపై వరదనీరు తగ్గుముఖం పట్టింది. ప్రజలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు.
ఇండ్లలోకి వరద ఎక్కువ చేరుకోవడం వలన పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేసే పనిలో ఉన్నారు. వరద ప్రబావం ఎక్కువగా ఉండటం వలన అంటు రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ముందుగానే ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్‌ ‌చల్లగా పట్టణమంతా ఫాగింగ్‌ ‌చేస్తున్నారు. దోమలు నివారించేందుకు కాలువల్లో ఆయిల్‌ ‌బాల్స్‌ను ఉంచుతున్నారు. రాష్ట్రం నుండి వచ్చిన అధికారులతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం భద్రాచలం పట్టణంలోనే మకాం వేస్తూ ముంపు బాధితులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాధితులకు 25 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, నిత్యవసర వస్తువులు అందచేసారు.
ఆర్ధిక సహాయం అందచేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు
image.png
వరద ప్రభావంతో తీవ్రంగా  నష్టపోయిన వరద బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించిన ఆర్ధిక సహాయం తక్షణమే ఇవ్వాలని కోరుతూ మంగళవారం నన్నపనేని స్కూలులో ఉన్న వరద బాధితులు చర్ల రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. తమకు ఆర్ధిక సహాయం అందచేయాలంటూ నినాదాలు చేసారు. తమకు స్పష్టమైన సమాచారం ఇచ్చేంతవరకు ధర్నా నిర్వహిస్తామని వరద
బాధితులు రోడ్లపైనే కుర్చున్నారు.
పోలీస్‌ అధికారులు నచ్చచెప్పినప్పటికి ఏమాత్రం వినలేదు. అలాగే బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి బిపిఎల్‌ ‌స్కూల్‌లో ఉన్న వరద బాధితులు రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేయాలంటూ నినాదాలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *