‘‘మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’
సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను కొన సాగిం చడంలో ప్రసార మా ధ్యమాలు కీలక పాత్ర పోషిస్తా యనడంలో ఎలాంటి అతిశ యోక్తిలేదు. స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్తు భారతావనికి ప్రేరణ కలిగించి ఒక్కత్రాటిపైకి తెచ్చి స్వాతంత్య్రంపొందడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఆక్రమించుకున్నదనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. భూప్రపంచంలో ఎక్కడేమీ జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ప్రతి సమాచారాన్ని వార్తారూపంలో జనాలకు చేరవేస్తుంది.
పరిణామక్రమంలో భాగంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పలు విప్లవాత్మకమైన మార్పులు రావడంతో ప్రసారమాధ్యమాల సంఖ్యాసైతం పెనుగుతూ వస్తున్నది. అయితేనేం తనకుండే ప్రాధాన్యత అలాగే ఉంటుంది. ఎంతలా అంటే మీడియా తలుచుకుంటే ‘‘జీరోను హీరో చేయగలదు – అదే హీరో క్రమం తప్పితే జీరో చేసే సామర్థ్యం’’ కేవలం వాటికే ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ప్రజలకు, ప్రసారమాధ్యమాల మధ్య అవినాభావ సంబంధం నెలకొని ఉంటుంది.సమాజంలోని మానవులు ఏ సమాచారాన్నైనా వీటిద్వారానే తెలుసుకుంటూ, వాటికనుగుణంగా నడుచు కుంటారు. అందుకే ప్రజలపక్షాన పెద్దన్నపాత్ర పోషిస్తూ, సమాజానికి అండగా నిలుస్తూ, తప్పుచేసేవారికి వణుకుపుట్టిస్తూ అంతేగాకుండా, అలాంటి ఆలోచన మరెవ్వరికీ రాకుండా ఉండటానికి తాపత్రయపడుతూ ‘‘తనకెవ్వరు సాటిలేరనే రీతిలో మనుగడ సాగించే సామర్థ్యం’’ కలిగివున్నదనే విషయం సుపరిచితమే.
సమాజంలో మంచి, చెడులను వివరిస్తూ, ప్రతిసమస్యకు పరిష్కారమార్గాలను చూపుతూ, ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలకు నోచుకుంటూ, సందేహాలను నివృత్తిచేస్తూ, ప్రజా స్వామిక సమాజంలో ప్రజలపక్షం నిలిచి, ప్రతిపక్షపాత్ర పోషిస్తూ వస్తుంది. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ఉన్నదిఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా, జరగాల్సిన తీరును, జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు ప్రజలకుచేరుస్తూ ప్రవర్తిస్తుం దనడంలో నిజం లేకపోలేదు.
అంతేందుకు మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే, ఎక్కడా ఏం జరిగిన క్షణాలలో సంఘటన స్థలంలోకి వెళ్ళీ వార్తలు సేకరించడం, ఎక్కడా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు జరగకుండా కారకులవుతున్న పాత్రికేయులకు ఫలానా సమయమంటూ ఏమి ఉండదు.ఏ అర్ధరాత్రిలో ఫోన్ కాల్ వచ్చిన సంఘటన స్థలాలకు చేరుకుంటారు.ఏవైనా అవినీతి కార్య కలాపాలు కొనసాగుతున్నాయని తెలిసిన,ధైర్యంతో కెమెరాలు,పెన్నులు తీసుకోని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు వెళ్ళుతూ, సాహసాలు చేస్తూ, ప్రపంచానికి వార్తన ందిస్తారు. కొన్ని సందర్భాలలో నిజాన్ని నిర్భయంగా వ్రాసినందుకు కక్ష్యగట్టేధోరణితో వారిపై దాడులు జరిగిన సందర్భాలు సైతం చాలా ఉన్నాయి.
నిన్నగాక మొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 391/1 సర్వే నంబర్ లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతుందని సమాచారం వచ్చిన వెంటనే, వెలుగులోకి తేవాలని వార్తాసేకరణకు వెళ్ళిన సీనియర్ జర్నలిస్ట్ మరియు ప్రజా జ్వాల ఎడిటర్ మాధగారి సుగ్రీవుడు ముదిరాజ్ మరియు ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ ఎల్లంపల్లి నర్సింహులు ముదిరాజ్ లపై కాపుకాసీ కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కొట్టడం, వారి కుటుంబ సభ్యులను చంపు తామని బెదిరించడం దేనికి నాందియో అర్థంకాని పరిస్థితి. ఇన్ని రకాల అవదొడు గులను ఎదుర్కుంటూ వృత్తిని కొనసాగిస్తున్నా పాత్రికేయులకు ఏడాది కాలంలో ఏవో పండుగల నిమిత్తం రెండు, మూడురోజులు సెలవులు మినహాయిస్తే సవత్సరకాలమంతా పనిచేయాల్సిందే.ఇదంతా చేస్తున్నప్పటికీ వారు అందుకునే నెలసరి వేతనం ఇప్పుడున్న పరిస్థితులలో చాలా తక్కువ, కొన్నిపత్రికలు మాత్రమే నెలసరి వేతనాన్నీ అందిస్తుందంటే, మరికొన్ని పత్రికలు వారు సేకరించిన వార్తలనుబట్టి జీతాలను ఇస్తుంటాయి.
అయినా వీరు ఈవృత్తిని ఇష్టపడి స్వీకరించడానికి గలకారణం సమాజంలో వీరుపొందే గౌరవం మాత్రమే. ప్రజలపక్షాన నిలిచి ప్రతిసమస్యను వెలుగెత్తి చూపుతూ ఒకరకంగా ప్రతిపక్షపాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కావున ఇటు ప్రజలనుండి, అటు ప్రభుత్వ అధికారులు సైతం వీరికి ప్రత్యేక గౌరవమర్యాదలుస్తుంటారు. వివిధ దిన పత్రికలలో,వివిధ టీవీన్యూస్ ఛానల్స్ లో పనిచెసేవారికీ ఒకగుర్తింపు ఉన్నది.అలాగే సమాజంలో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను, ప్రజల సమస్యలను,ప్రభుత్వాల పనితీరును, పలు అంశాలపట్ల సమాచారాన్ని సేకరించి, అవగాహన చేసుకోని, పరిశీలించి, విశ్లేషిస్తూ వార్తలను అందిస్తారు. వాటివల్ల కొన్ని సందర్భాలలో చిక్కుల్లో సైతం పడతారు. ఏదైతేనేమి సమాజంలో ప్రజలపక్షాన నిలుస్తూ, ప్రభుత్వానికి ప్రతిపక్షపాత్ర పోషిస్తూ, సమాజ శ్రేయస్సుకై సాహసాలు చేస్తున్న జర్నలిస్ట్ ల రక్షణకు బాధ్యత ప్రభుత్వం, సగటు మానవుని తోపాటు సర్వప్రజానీకం సైతం చర్యతీ సుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ఎప్పుడైనా, ఎక్కడైనా జర్నలిస్టులపై దాడి జరిగినవెంటనే ప్రభుత్వం స్పందించి,తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా వారిపై కఠినశిక్షలు విధిస్తూ,మరెవరికి దాడిచేయాలనే ఆలోచనరాకుండా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ,
9441930361.




