ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

మంత్రి కొండా సురేఖ
రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడిరచారు.  దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి కొండా సురేఖ  ఆదేశించారు.

గోల్కొండ కోటలో బోనాల జాతర ఉత్సవాలపై మంత్రులు కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్‌ సమీక్ష నిర్వహించారు.  సమావేశానికి హాజరుకాని అధికారులపై మంత్రి కొండా సురేఖ  సీరియస్‌ అయ్యారు.  మీటింగ్‌ కు రాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.  లక్షల మంది జరుపుకునే పండుగకు సంబంధించి సమావేశం పెడితే. మంత్రులు, మేయర్‌ వచ్చారు. కానీ అధికారులు రారా అని ప్రశ్నించారు.  గోల్కొండ కోటలో 9 వారాలు బోనాలు సమర్పించే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం భక్తులు వస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *