గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది పాలస్తీనియన్లు, వీరిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు మరణించారు మరియు 74,518 మంది గాయపడినట్లు నివేదించబడిరది. మృతుల సంఖ్య 13,000 కంటే ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.ఇజ్రాయెల్‌ చేస్తున్న కనికరంలేని యుద్ధం ఇప్పటికే గాజాలో ఎక్కువ భాగాన్ని నాశనం చేసింది గత 6 నెలల్లో గాజాలో పనిచేస్తున్న 100 మందికి పైగా యునైటెడ్‌ నేషన్‌ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.,నర్సులు,హాస్పిటల్‌  సిబ్బందితో పాటు హాస్పిటల్లో  ఆశ్రయం పొందిన వేలాది మంది నిర్వాసితులపై చెప్పలేనంత దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. మహిళా ఖైదీలు అత్యాచారానికి, ఆకలికి, హింసలకు బలై పోతున్నారు.

గాజాలో తగినంత పని చేసే హాస్పిటల్స్‌ , వైద్యులు మరియు వైద్య సిబ్బంది, మందులు, స్వచ్ఛమైన నీరు మరియు గాయపడిన వారికి చికిత్స చేయడానికి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కూడా లేవని ఆరోగ్య అధికారులు నివేదించారు.వీరిలో చాలా మంది వైద్య సంరక్షణ లేకపోవడం వల్ల మరణిస్తున్నారు.మార్ఫిన్‌, పెయిన్‌కిల్లర్‌ మందులు లేకపోవడంతో చిన్నారులు వేదనతో చనిపోతున్నారని, సర్జరీలు చేస్తున్నప్పుడు లేదా విరిగిన ఎముకలను మళ్లీ అమర్చడం వల్ల హాస్పిటల్స్‌ ల్లో   పడకలు లేకపోవడంతో నేలపైనే చనిపోవడం, ప్రాణాధారమైన మందుల కొరత, వైద్యులకు వైద్యం చేయాల్సి వొస్తోందని వారు వివరించారు.ప్రాథమిక వైద్య సహాయం,మందులు అందుబాటులో ఉంటే చాలా మందిని రక్షించవచ్చని వారు చెప్పారు.

వందలాది మంది ఒకే మరుగుదొడ్డి, స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.పారిశుధ్యం మరియు పరిశుభ్రత  ఈ భయంకరమైన పరిస్థితులలో, హెపటైటిస్‌ , డయేరియా మరియు ఇతర అంటు వ్యాధులు వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.రెండేళ్లలోపు ప్రతి ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.గాజా ఎల్లప్పుడూ బయటి నుండి వొచ్చే ఆహార సరఫరాపై ఆధారపడి ఉంటుంది. అక్టోబర్‌ 7, 2023 తర్వాత, ఇజ్రాయెల్‌ గాజాకు అన్ని ఆహార ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేసింది.గాజాలోకి ఆహార సహాయాన్ని అనుమతించాలనే అంతర్జాతీయ డిమాండ్ల తర్వాత కూడా ఇజ్రాయెల్‌ కేవలం ఆహార ట్రక్కులను మాత్రమే ప్రవేశించడానికి అనుమతిస్తోంది, ఇది ప్రజల అవసరాలను తీర్చడానికి పూర్తిగా సరిపోదు. ఇజ్రాయెలీ మారణహోమ యుద్ధం ప్రారంభమై ఎడతెగని ఇజ్రాయెల్‌ బాంబు దాడుల వల్ల గాజా నగరం  ఓడరేవు తీవ్రంగా దెబ్బతింది, దీని ఫలితంగా ప్రజలకు ఆహారం మరియు ఆదాయానికి ప్రధాన వనరుగా ఉండే చేపలు పట్టడం ఆగిపోయింది..ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌  తాజా నివేదిక ప్రకారం గాజా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని తీవ్రమైన ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024 మార్చి మధ్య నాటికి, గాజా జనాభాలో కనీసం 50% మంది కరువును ఎదుర్కొంటున్నారు.

ఉత్తర గాజా, దాదాపు 3,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు, ఇజ్రాయెల్‌ ఒక చెక్‌పాయింట్‌ మినహా ఉత్తర సరిహద్దును మూసివేసినందున ఆహారం, మందులు మరియు ఇతర సహాయ సామాగ్రి నుండి నిలిపివేయబడిరది.గాజాలోని మారణహోమాన్ని కవర్‌ చేసేందుకు గాజాలోకి విదేశీ జర్నలిస్టులను అనుమతించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరించింది.గాజాలో యుద్ధాన్ని కవర్‌ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబ సభ్యులపై పలు దాడులు,బెదిరింపులు,సైబర్‌టాక్‌లు,సెన్సార్‌షిప్‌ మరియు హత్యలు జరిగాయి.మారణహోమం అంతటా, పాలస్తీనియన్లకు సంఫీుభావంగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మరియు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా మౌనంగా ఉన్నారు.ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధానికి వ్యతిరేకంగా కార్మికులు, మహిళలు మరియు యువకుల నిరసనలు చేపట్టారు.గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగుతున్న మారణహోమ యుద్ధం ప్రస్తుతం మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరాలలో ఒకటి.పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమ యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.అమెరికా పూర్తి మద్దతుతో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణహోమ పోరు తక్షణమే ఆగిపోవాలి.
 (ఆంగ్ల అనువాద సేకరణ)
-ఆళవందార్‌ వేణు మాధవ్‌
8686051752,హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *