నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మహేశ్వర్ రెడ్డి కి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి B.P, షుగర్ లెవెల్స్ గంట గంటకు పడిపోతున్నాయి అని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష ఇలాగే కొనసాగితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని డాక్టర్లు తెలిపారు.



