కౌంట్‌ ‌డౌన్‌..13 ‌ప్రజా‘తంత్రం’

ఎలక్షన్‌ ‌ముందు వోటర్లే దేవుళ్లు
ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు
గట్టుకి చేరాక ఇంతే సంగతులు
మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు!

మూస పోసినట్టుగా అభ్యర్థులు
ఎంపిక సమస్యతో జనం తిప్పలు
అరుదైన జాతిగా నిబద్ధ నేతలు
వీరే మెరుగైన సమాజానికి కర్తలు
– వి.రమేష్‌ ‌బాబు

37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో అని .. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌ ‌సర్కార్‌ అవినీతికి పాల్పడిందని  ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీ మణుగూరు,నర్సంపేట మరియు వరంగల్‌ ‌నగరంలో రోడ్‌ ‌షో ,కార్నర్‌ ‌మీటింగ్‌ ‌లలో పాల్గొన్నారు. తెలంగాణతో తనకున్న సంబంధం రాజకీయ సంబంధం కాదని, రక్తసంబంధం అని  రాహుల్‌ ‌గాంధీ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏమి చేసిందని అడుగుతున్నారని, అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌ అని, కేసీఆర్‌ ‌చదువుకున్న బడి, నడుస్తున్న రోడ్లు వేసింది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని రాహుల్‌ ‌గాంధీ  అన్నారు. బీఆర్‌ ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు కరీంనగర్‌,‌చొప్పదండి,హుజురాబాద్‌ ‌మరియు పరకాల నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ‌మాయ మాటలను నమ్మి మోసపోవద్దని సిఎం కెసిఆర్‌ ‌ప్రజలకు సూచించారు. .కాంగ్రెస్‌ ‌పార్టీ మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్నిటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *