కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన వైయస్‌ ఆర్‌ ‌సి పి మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ‌రహీం ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌, ఆయిళ్ల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌గూడూరు శ్రీనివాస్‌ ‌రెడ్డి, బాలాజీ సింగ్‌ ‌లు కాంగ్రెస్‌ ‌పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం లోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్‌ ‌పార్టీ వైపే ఉన్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ గ్యారెంటీ కార్డులైన 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌ అం‌దజేస్తామన్నారు. మహాలక్ష్మి ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. గృహ జ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇం‌దిరమ్మ ఇండ్ల ద్వారా ఇండ్లు లేని వారికి ఐదు లక్షలు, ఇంటి స్థలం అందజేస్తామన్నారు. చేయూత పథకం ద్వారా నెలవారి పింఛను రూ. 4 వేలకు పెంచుతామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా ద్వారా రూ. 10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు.

రైతు భరోసా పేరిట రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15000 అందజేస్తామని వ్యవసాయ కూలీలకు 12,000 వరి పంటకు 500 బోనస్‌ అం‌దజే స్తామన్నారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అందజేసి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సర్వతో ముఖావృద్దికై బంగారు తెలంగాణ సాధనకై కాంగ్రెస్‌ ‌పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. వైయస్సార్‌ ‌సీపీకి చెందిన ఎం ఏ రహీం, ఎండి గౌస్‌, ఎం‌డి తయ్యబ్‌, ‌జహంగీర్‌, ‌సత్తార్‌, ‌సలీం, మోయిన్‌, ‌షాకీర్‌, ‌ఫెరోజ్‌, ఆసిఫ్‌, ‌భాస్కర్‌, ‌జహంగీర్‌, ‌పాష, నరసింహ, మజీద్‌, ‌సత్తార్‌, ‌రఫీ, మజీద్‌ ‌ఖురేషి, బాబా, సిమ్రాన్‌, ఇ‌మ్రాన్‌, ‌హాజీ, శివ, మహేష్‌, ‌వంశీ, మధు, సర్వర్‌, అం‌జద్‌ ‌లు కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్‌ ‌మైనుద్దీన్‌, ‌వస్పుల జంగయ్య, వస్పుల మాన్నయ్య, జంతుక యాదయ్య, ఖాదర్‌ ‌ఖాద్రి, చాంద్‌ ‌పాషా, షర్ఫుద్దీన్‌, ‌ఖలీల్‌ ‌ఫోటో, కరీం, ఖాదర్‌, ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, తాళ్ల రవి, మెకానిక్‌ ‌బాబా, కృష్ణా నాయక్‌, ‌రామ్‌ ‌నుంతుల మాజీ సర్పంచ్‌ ‌రచ్చ శ్రీరాములు, వస్పుల శ్రీశైలం, శ్రీకాంత్‌, ‌నాజర్‌, ఎమ్‌ ఎ. ‌రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *