ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం

ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు  ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసిన ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్‌ తేదీ మరియు ఎలక్టోరల్‌ బాండ్‌ డినామినేషన్‌ ఉంటుంది అని బెంచ్‌ పేర్కొంది. ఎన్నికలలో పారదర్శకత మరియు నిష్పాక్షికతను నిర్ధారించడానికి అనామక రాజకీయ పార్టీల నిధులను అనుమతించే ఎలక్టోరల్‌ బాండ్‌ పథకాన్ని తప్పనిసరిగా సమీక్షించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజాస్వామ్యంలో తెలుసుకునే హక్కు అత్యంత ప్రధానమని, పార్టీ నిధుల వివరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, దాతలను రక్షించడానికి అజ్ఞాతం అవసరమని ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. ఇది తప్పులను శాశ్వతం చేస్తుంది మరియు అవినీతిపై పోరాటానికి ఆటంకం కలిగిస్తుంది అని ధర్మాసనం తెలిపింది.  ఈ పథకం కింద అధీకృత ఆర్థిక సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏప్రిల్‌ 12, 2019 నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బాండ్ల జారీని నిలిపివేయాలని, వివరాలను ఎన్నికల కమీషన్కి వెల్లడిరచాలని యస్‌ బి ఐ ని ఆదేశించింది.

ఎలక్టోరల్‌ బాండ్‌ అంటే…?
భారతీయ పౌరుడు లేదా భారతదేశంలో రిజిస్టర్‌ చేయబడిన ఏదైనా సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన కె వై సి నిబంధనలను పాటించిన తర్వాత ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు . భారతీయ స్టేట్‌ బ్యాంక్‌  యొక్క నిర్దిష్ట శాఖల నుండి వెయ్యి, పదివేలు, ఒక లక్ష, పది లక్షలు మరియు ఒక కోటి వంటి వివిధ డినామినేషన్లలో చెక్కు లేదా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా మాత్రమే దాత దీనిని సేకరించవచ్చు . జారీ చేసిన 15 రోజుల వ్యవధిలో, ఈ ఎలక్టోరల్‌ బాండ్‌లను కనీసం 1% ఓట్లను పొందిన ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (సెక్షన్‌ 29%A%) ప్రకారం చట్టబద్ధంగా నమోదైన రాజకీయ పార్టీ యొక్క నియమించబడిన ఖాతాలో రీడీమ్‌ చేయవచ్చు. ఈ బాండ్ల చెల్లుబాటుకు 15 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీటిని రాజకీయ పార్టీలు 15 రోజులు లోగా తమ ఖాతాలో డిపాజిట్‌ చేసుకోని పక్షంలో బదులుగా, ఎలక్టోరల్‌ బాండ్‌ యొక్క ఫండ్‌ విలువ ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేయబడుతుంది. ఫైనాన్స్‌ బిల్లు 2017తో ప్రవేశపెట్టబడిన ఎలక్టోరల్‌ బాండ్లు రాజకీయ పార్టీలకు నిధులను విరాళంగా ఇవ్వడానికి ఉపయోగించే సాధనాలు లేదా సెక్యూరిటీలు. ఎలక్టోరల్‌ బాండ్‌లు 2018 సంవత్సరంలో నోటిఫై చేయబడ్డాయి.

దాత ఈ బాండ్లను రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తాడు. ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ పాత విరాళాలకు వ్యతిరేకంగా చర్యగా ఉన్నప్పటికీ, చెక్కులు మరియు లావాదేవీల డిజిటల్‌ పేపర్‌ ట్రయల్స్‌ ద్వారా బాండ్‌లు ఉంటాయి కాబట్టి, ఈ పథకంలోని అనేక కీలక నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విరాళాలు ఎక్కడి నుండి వచ్చాయో వెల్లడిరచాల్సిన బాధ్యత దాత (వ్యక్తిగత లేదా కార్పొరేట్‌) లేదా రాజకీయ పార్టీపై ఉండదు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ఫైనాన్స్‌ బిల్లు ద్వారా ప్రవేశపెట్టబడిరది మరియు 2018లో అమలు చేయబడిరది. రాజకీయ నిధులకు పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నాలలో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. సాధారణ లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలా ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఆ బాండ్లను కొని విరాళాలుగా అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల  పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. విరాళాలు అందించే వారి వివరాలు గోప్యంగా ఉండడం వలన నల్లధనానికి ఆస్కారం ఉందని, కార్పొరేట్‌ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందజేయడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలు ఉన్నాయి. ఈ పథకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. మొదటి పిటిషన్‌ను 2017లో రాజ్యాంగ సంస్కరణల రంగంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా దాఖలు చేస్తే, రెండో పిటీషన్‌ను 2018లో సీపీఐ(ఎం) దాఖలు చేసింది. ఈ పథకం రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు, దేశీయ, విదేశీ సంస్థల నుంచి గోప్యతతో, భారీగా నిధుల ప్రవాహానికి గేట్లు తెరిచేలా ఉందని, దీని వలన భారీ స్థాయిలో ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేసినట్లు అవుతుందని పిటీషన్లలో పేర్కొన్నారు.

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *