అయోధ్యను బాగా హైలెట్ చేసేలా ప్రచారం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10:
అన్ని సీట్లలో కాకపోయినా కొన్ని స్థానాల్లోనైనా ఇంచార్జిలకు సీట్లు ఇస్తారా అనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇక ఎంపీ స్థానానికి కూడా పార్టీలో డిమాండ్ నెలకొంది. ఒక్కో సీట్ కోసం ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు ఆశావాహులు ఢల్లీి స్థాయి నుంచి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలతో పాటు సీనియర్ నాయకులు కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తాము అవలంబించిన గెలుపు వ్యూహాన్ని ఎంపీ ఎన్నికల్లో ఉపయోగిస్తారన్న ఆలోచలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రచారంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పక్కాగా ఉంటుందని బీజేపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే వారికి ఇంచార్జి బాధ్యతతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీలు అందరికీ తమ సొంత పార్లమెంట్ నియోజవర్గ బాధ్యతలు అప్పటించారు. దీనివల్ల అసెంబ్లీ నియోజక వర్గాలను ప్రభావితం చెయ్యడంతో పాటు పక్క నియోజవర్గాలను కూడా కోఆర్డినేట్ చేసుకోవచ్చనేది పార్టీ అగ్ర నేతల వ్యూహంగా తెలుస్తోంది. నాలుగు సీట్లను గతంలో గెల్చుకోగా మోడీ ఛరిష్మాతో మరో 8 సీట్లను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అయోధ్య అంశాన్ని బాగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే తమను గట్టెక్కించగలదని నేతలు భావిస్తున్నారు.





