ఊరి గోదాములుగా సర్కార్‌ ‌బడులు..!

‘‘‌గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా నేడు ఊరి గోదాంలుగా రూపాంతరం చెందుతున్నాయి.ప్రభుత్వ బడి ఊరికి ఉపాధి కల్పిస్తుందని, సామాజికత పెంపొందిస్తుందని, నైతిక విలువల పెంపుదలకు దోహదపడుతుందని నాడు బడుల ఏర్పాటు జరిగింది. కానీ నేడు తెలంగాణ పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష ఫలితంగా ప్రభుత్వ బడి రూపురేఖలు మారుతున్నది.గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ బడులనుగ్రామ పంచాయతీ కార్యాలయలు గానూ, అంగన్వాడి సెంటర్‌ ‌గానూ,పాఠశాల ఆటస్థలాలను తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గానూ,పల్లె ప్రకృతి వనాలుగాను, నర్సరీ కేంద్రాలుగా, మిషన్‌ ‌భగీరథ ఓవర్‌ ‌హెడ్‌ ‌వాటర్‌ ‌ట్యాంక్‌ ‌లు గాను,కుక్కల సంతాన నిరోధకకేంద్రాలు గాను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ బడి మూతబడటానికి, విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలు విచిత్రంగా తోస్తున్నాయి. విద్యాభిమానులు వాస్తవంగా విశ్లేషిస్తే ప్రభుత్వ విధానాలా! ఉపాధ్యాయుల స్పందన కొరవడడమా,తల్లిదండ్రుల చొరవ లేకపోవడమా!అనేది బోధపడుతుంది.విద్యాభివృద్ధి కోసమని రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగానే ప్రతి గ్రామ ప్రాంతాల్లో పాఠశాల నిర్మాణం జరిగింది. కానీ నేడు కొత్త బడుల నిర్మాణాలు లేకపోగా ఉన్న నిర్మాణాలను ఆ గ్రామాలలో. అవసరాల మేరకు కార్యాలయాలుగా మార్చుకుంటూనన్న దుస్థితి కన్పిస్తుంది.

ఒక ఊరి బడి మూత పడటానికి కారణం విద్యార్థులు నమోదు కాకపోవడం ప్రధానంగా చెప్పబడుతూన్నదికానీ,విద్యార్థుల నమోదు కాక పోవడానికి కారణం స్థానిక బడిలో తగినన్ని కనీస మౌలిక వసతులు లేకపోవడం,ప్రాథమిక సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఉండడం,తరగతికి ఒక గది, ప్రతి తరగతి కి ఉపాధ్యాయుడు లేకపోవడం 5 తరగతుల కు ఒకే గది ఉండటం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన జరగడం ఇవన్నీ కూడా ప్రధానకారణాలుగా పరిగణించకపోవటం శోచనీయం.ఆయాప్రాంతాల్లో తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగి,ఖర్చు భరించయినా సరే తమ పిల్లలను సమీపంలోని ప్రైవేట్‌ ‌పాఠశాలలకు పంపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యతారహితం ఫలితంగానే బడులు మూతపడుతున్నవనే విషయాన్ని అందరం గమనించాలి.బడి ఆవాస ప్రాంత పరిధిలో బడి పిల్లలు ఉన్నప్పుడు,ఊరి బడి లోనే ఊరి పిల్లవాడు చదువుకో కలిగిగనప్పుడు బడి మూతబడే అవకాశం లేదు.కానీ ప్రజా ప్రతినిధులు సర్కార్‌ ‌బడిను ఊరి సంపదగా గుర్తించటం లేదు. వారి చొరవ కరువైన కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్‌ ‌విద్యాలయాలకు పంపిస్తున్నారు.

ఇటీవల పాఠశాలలో సందర్శిస్తే పలు విషయాలు అవగతమైనది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ప్రతి 500 జనాభాకు ఒక గ్రామపంచాయతీ ఏర్పాటు చేశారు..ఇందుకు అనుగుణంగా ఆయా గ్రామాల నూతన భవనాలు నిర్మించక పోవడం వలన అక్కడ ప్రజాప్రతినిధులకు కనపడేది బడి మాత్రమే!అదే గ్రామ పంచాయతీ కార్యాలయంగా మారినది, ఎటువంటి అనుమతులు లేకుండానే బడిని క్రమక్రమంగా గ్రామ అవసరాలకోసం బడిని ఆక్రమించటం సాధారణంగా మారింది. పాఠశాల ఆవరణలో ని క్రీడా స్థలాలుగా,పల్లె ప్రకృతి వనాలుగా,నర్సరీ కేంద్రాలుగానూ , మిషన్‌ ‌భగీరథ పనుల కు సంబంధించి నిర్మాణ పనులకుగానూ వినియోగిస్తున్నారు. బడి పిల్లల మానసిక,శారీరక వికాసానికి ఉపయోగించే పాఠశాల ఆట స్థలము బడుల్లో క్రమంగా కనుమరుగవుతూన్నది..మహబూబాబాద్‌ ,‌వరంగల్‌ ‌సిద్దిపేట జిల్లాల్లో కొన్ని పాఠశాలల్లో గ్రామపంచాయతీ కార్యాలయం, నర్సరీలు, ఓవర్‌ ‌హెడ్‌ ‌ట్యాంకులు, పల్లె ప్రకృతి వనాలు పాఠశాలలు నిర్మించటం సర్కారు బడినిక్రమంగా లేకుండా మాయం చేయటంలో భాగంగానే భావించక తప్పటం లేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలోనూ గ్రామీణ క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కార్యాచరణణ చేపట్టింది.ఇందుకు గ్రామంలో ప్రభుత్వ భూమి సేకరించి ఒక ఎకరం స్థలంలో వాలీబాల్‌,‌ఖో ఖో, కబడ్డీ ఇతర క్రీడలకు అనుగుణంగా స్థలాన్ని చదును చేసి చుట్టూ మొక్కలు పెంచేందుకు సుమారు ఐదు లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికను ప్రకటించింది.కానీ, అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని సేకరించకుండా గ్రామం సర్కారు పాఠశాల ఆట స్థలం లోనే తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి,విద్యార్థుల ఆట స్థలాన్ని ఆక్రమించటం బాధాకరమైన విషయం.రోజురోజుకు గ్రామ అవసరాల కోసం మూతబడిన బడిని ఉపయోగించుకునే స్థితిని ప్రభుత్వమే కల్పించడం భవిష్యత్తులో ప్రభుత్వ బడుల ప్రమాదం గా ఉండబోతుందని విషయాన్ని గమనించాలి.మూసిన బడులను తెరిపించాల్సిన ప్రభుత్వమే వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించడం అంటే ప్రభుత్వ బడిని పాతరపెట్టినట్లేనని భావించాలి.

గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం. స్థానిక తల్లిదండ్రులలో చైతన్యం కలిగించి పాఠశాల ఆవరణలో ఇతర ఏ నిర్మాణాలు కాకుండా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకూ,గ్రామప్రజలకు ఉన్నదని గుర్తించాలి.
– మైస శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి
టీపీటీఎఫ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *