ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్ సమీక్ష
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు
వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ నున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాల నపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామిన కాంగ్రెస్ హా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటి అమలు కోసం సబ్ కమిటీని వేసినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిజమైన లబ్దిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల హాకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను జరిగాయి. హాల అమలులో ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైం పాస్ చెయ్యబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభయహస్తం హాలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సక్ష ముగిసిన అనంతరం పొంగులేటి డియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హాలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కమిటీ ఛైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులుగా తాను, మంత్రి శ్రీధర్‌బాబు ఉంటామని వివరించారు. నిజమైన లబ్దిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హా ఇచ్చాం.. చేసి తీరుతామన్నారు.
ఆరు పథకాల అమలుకు సబ్ కమిటీని ప్రకటించామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్ గా ఉంటారని చెప్పారు. ఆరు పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సబ్ కమిటీదేనన్నారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు. నిజమైన అర్హులను గుర్తించాలనే తమ లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని.. కారుకూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సహించబోదన్నారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు ఐదు గ్యారంటీల కోసం దాదాపు కోటి 25 లక్షలకు పైగా మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను జనవరి 17 వరకు ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది.





