అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి ప్రదర్శన చేసాడు. పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. తన వ్యవసాయ శాఖ ఉద్యోగాన్ని కోల్పోయారు. జైలు జీవితాన్ని అనుభవించారు.   తన రాజకీయ దృక్పధాన్ని గాడిలో పెట్టిన కమ్యూనిస్టు నాయకుడు ఓంకార్‌ ఉద్యోగ సంఘాల నిర్వహణలో తనకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ ఎన్జీ ఓ ల  నేత నెల్లుట్ల జగన్‌ ‌మోహన్‌ ‌రావు ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారు.’’

నేడు జగన్నాధ దామోదర్‌ ‌వర్ధంతి

ఉద్యోగ సంఘాల నాయకత్వంలో విషయ స్పష్టతతో అందరికి అర్ధమయ్యే విధంగా ప్రసంగించే నైపుణ్యం, సమస్యల పరిష్కారం కోసం తెగువతో తాను ముందుండి, సహచ రులను నడిపించే దక్షత, కాలానుగుణంగా వస్తు న్న సామాజిక మార్పులను అధ్యయనం చేస్తూ ఆ వెలుగులో తన పోరాట కార్యక్రమాల్ని మార్చుకోవడం మొదలగు అంశాలు జగన్నాధ దామోదరం విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాయి.

ప్రవహించే ఉత్తేజం –
తన విద్యార్థి,.నవ యవ్వన కాలంలో మరియు చివరి శ్వాస వరకు ఉద్యోగుల కోసం వారిని పోషిస్తున్న ప్రజల పక్షం వహించిన మనకాలపు మహా యోధుడు. తొలుత తన జాతీయోద్యమ నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తగా తన రాజకీయ కార్యాచరణ ప్రారంభించాడు. మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్‌ ‌నేత తక్కలపెల్లి పురుషోత్తం రావు సహచరుడిగా కాంగ్రెస్‌ ‌రాజకీయాలలో కొంతకాలం కొనసాగాడు. వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో పేద వర్గాలకు సీట్లు ఇవ్వాలని పోరాడి సాధించిన వారి గెలుపు కోసం పని చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన అనేక విజయాలు, భారత స్వాతంత్ర సమరంలో ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దం భారత రాజ్యాంగం. ఈ వెలుగులో లో పని చేయడం లేదని ప్రజలు మరింత పరాధీనతకు గురవుతున్నదని అని మదన పడ్డాడు. తొలి తరం నక్సల్‌ ‌నేతగా.. 1968లో ఇంట్లో నక్సల్బరి వసంత మేఘ గర్జన తెలంగాణకు వ్యాపించింది.

కొండపల్లి సీతారామయ్య శివసాగర్‌ ‌చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి నేతల ప్రభావంతో దున్నేవాడిదే భూమి, రైతుకూలీల పోరాటాలు ఉప్పెనగా కొనసాగుతున్నాయి. ఈ పోరాటాలకు, తక్షణంగా అవి సాధిస్తున్న ఫలితాలకు ప్రేరేపించబడిన జగన్నాథ్‌ ‌దామోదర్‌ ‌వామపక్ష విప్లవ ఉద్యమాలతో మమేకమయ్యాడు. ఖమ్మం జిల్లాలో సిపిఐ ఎం ఎల్‌  ‌పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ విస్తరణకు కృషి చేశాడు. విప్లవ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. వామపక్ష విప్లవ ఉద్యమాలలో వస్తున్న చీలికలు పీలికలు ఆయనను బాధకు గురి చేశాయి. మరీ ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నర్సంపేట ప్రాంతంలో భూస్వాములను అణచివేసే సామాన్య ప్రజల గొంతుక విలువను పెంచిన యోధుడు అసెంబ్లీ టైగర్‌ ఓం‌కార్‌ ‌పై పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ వరుస దాడులను ఆయనను చలింపచేశాయి. ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న సంస్థలు విమర్శ లేదా సమాంతరంగా పని చేయాలి తప్ప దాడుల సంస్కృతి తప్పని అభిప్రాయపడ్డాడు. 1972లో ఓంకార్‌ ‌పరిచ యంతో ఆ వ్యక్తిత్వానికి విధే యుడుగా సహచరుడు గా మారి జీవితాంతం పూర్తి చేశాడు.

తెలంగాణ ఉద్యమ సితార :
1969 లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి, శివసాగర్‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దిం చింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసులో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాది మందిని సమీకరించి ప్రదర్శన చేసాడు. పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. తన వ్యవ సాయ శాఖ ఉద్యో గాన్ని కోల్పోయారు. జైలు జీవితాన్ని అనుభవి ంచారు.ఏమాత్రం వెరవకుండా ఓంకార్‌ ‌సహచరుడిగా రైతు ఉద్యమాలలో మరియు తెలంగాణ సాధనలో నిర్విరామ కృషి చేశారు. 19 లో వ్యవసాయ మార్కెట్‌లో ఉద్యోగంలో చేరారు. ఆసి యాలో అతి పెద్ద మార్కెట్‌ ‌గా ఏనుమాముల మార్కెట్‌ ‌రూపా ంతరం చెందడం లో ఉద్యోగిగా ఉద్యోగ సంఘ నేతగా దామోదర్‌ అద్వితీయ కృషి చేశారు.వ్యవసాయ మార్కెట్‌ ఉద్యోగుల సంఘానికి ఏకధాటిగా 25 సంవత్సరాలు అధ్యక్ష్యునిగా కొనసాగారు.

తన సహ జత కార్మిక కర్షక అనుకూల తాత్వికతను ఆచరణ పెట్టడానికి మార్కెట్‌ ఒక వేదికగా పని చేసింది. హమాలీలు, గుమస్తాలు, ఉద్యోగులు, సమస్త వర్గాల సమస్యలను అర్థం చేసుకొని మిలిటెంట్‌ ‌స్వభావంతో పోరాడి పరిష్కరించే వాడు. మార్కెట్‌ ‌కమిటీ ఉద్యో గులకు సొంత భవనాన్ని నిర్మించుకున్న తొలి ఉద్యోగ సంఘ నాయకుడు గా కార్మిక ఉద్యమాల చరిత్రలో జగన్నాథ్‌ ‌దామోదర్‌ ‌నిలిచిపోతారు. 800 గజాల స్థలాన్ని,10 లక్షల రూపాయలను సేకరించి మార్కెట్‌ ఉద్యోగుల భవన నిర్మాణం చిరస్మరణీయ అంశంగా నిలిచిపోతుంది. వ్యవసాయ మార్కెట్‌ ‌ను లక్ష్మీపురం నుండి ఈ ప్రాంతానికి తరలింపు చెయ్యడంలో అమోఘమైన కృషి చేశాడు. ప్రజల సమస్యల పరిష్కా రంలో వారి సుభిక్షంలో తమ జీవనం భద్రత ఉందనే తాత్వికతతో, ప్రాంతీయ ఆకాంక్షలతో ఏర్పడిన చారిత్రాత్మక సంఘం టి యన్‌ ‌జి ఓ లో క్రమశిక్షణ గల ఉక్కు మనిషిగా పేరొందాడు.

image.png
జగన్నాధ దామోదర కు కృతజ్ఞత స్వభావం మన వ్యక్తిత్వంలో ఉన్న అపూర్వమైన విషయం. తన రాజ కీయ దృక్పధాన్ని గాడిలో పెట్టిన కమ్యూనిస్టు నాయ కుడు ఓంకార్‌ ఉద్యోగ సంఘాల నిర్వహణలో తనకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ ఎన్జీఓల నేత నెల్లుట్ల జగన్‌ ‌మోహన్‌ ‌రావు ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకు నేవారు. వీరిద్దరికి కుడి భుజంగా నిలిచాడు. 2003 లో పదవి విరమణ తరువాత మరింత రెట్టించిన ఉత్సాహంతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్నారు. వరంగల్‌ ‌నగరంలో వారు హాజరుకాని పాల్గొనని, సమీకరించిని సభ అంటూ లేదు. రిటైర్డ్ ఉద్యోగులను సమీకరించి వారి గొంతుకగా సభలు సమావేశాలలో వక్తగా పాల్గొనేవాడు. రాడ్‌ ‌వేసు కున్న కాళ్లు ఉన్నా ఉద్యమ యాత్రలో తన నడకను అలుపు లేకుండా కొనసాగించాడు. మానుకోట నిప్పురవ్వ మే 28,2010లో లోకసభలో తెలంగాణ కు వ్యతిరేకంగా సమైక్య ప్లకార్డ్ ‌లు పట్టుకుని నిరసన తెలిపిన జగనమోహన్‌ ‌రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో మానుకోట ద్వారా తెలంగాణ లో పర్యటిం చాలనుకున్నాడు.
దీనికి వ్యతిరేకంగా పొలిటికల్‌ ‌జాక్‌,‌హక్కుల, న్యాయవాద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మానుకోటకు చేరుకున్నాయి.వీరి పై కాల్పులకు తెగబడ్డప్పుడు ప్రజలు కొంత వెనుక డుగుకు, చెల్లా చెదురు అయ్యే పరిస్థితి కనిపించి ంచింది.తన ఆరోగ్యాన్ని.తన వయసును లెక్క చేయకుండా ఈ నిరసనలో పాల్గొన్న జగన్నాధం దామోదర్‌ ‌కాల్పులను ధిక్కరిస్తూ ముందుకు నడిచాడు. ప్రజలంతా దామోదర్‌ ‌సాహస అడు గులను అనుసరించి రాళ్లతో కాల్పులు జరుపుతున్న జగనమోహన్‌ ‌రెడ్డి మద్దతుదారులపై దాడి చేసారు. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే త్యాగ గుణానికి ప్రతీకగా నిలిచారు. పరిటాల సుబ్బన్న, కారం రవీందర్రెడ్డి, రాజేష్‌ ‌కుమార్‌, ‌జగన్‌ ‌మోహన్‌ ‌రావు వంటి ఉద్యోగ సంఘాల నేతలకు నిరంతరం ప్రేరణ గా నిలిచాడు.
1969, 2001 రెండు దశల తెలంగాణ పోరాటంలో క్రియాశీల కార్యకర్తగా నేతగా పనిచేసిన దామోదర్‌ ‌తెలంగాణ రాష్ట్రం సాకారం అవ్వడంతో పసిపిల్లాడిలా ఆనందపడ్డాడు. నేను సైతం నిర్మించిన త్యాగం చేసిన తెలంగాణ పోరాటం అపూర్వ విజయం అందుకోవడం లో తన వంతు చారిత్రక పాత్రను పోషించినన ఆత్మ సంతృప్తిని పొందాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారులకు రాజకీయ శిక్షణా పాఠశాలగా దొడ్డి కొమురయ్య పౌండేషన్‌ ‌చారిత్రక పాత్రను నిర్వహించింది. 2010 నాటికి భావజా లపరంగా జగన్నాథం దామోదర్‌ ‌గారు ఈ వ్యాసకర్త అస్నాల శ్రీనివాస్‌ ‌కు ఆత్మీయుడు అయ్యాడు. నాన్న అనే పిలుపు తో నన్ను తన మానస తనయుడు గా భావించి అక్కున చేర్చుకుని మా ఫౌండేషన్‌ ‌కార్యక్ర మాలకు అండగా నిలిచారు. సమాజం కోసం పనిచేసిన త్యాగం చేసిన వీరులను కుటుంబాల తలుచుకోవడం ఫలితాలు పొందిన సమాజం పట్టించుకోకపోవడం వంటిపై బాధపడ్డాడు. దామోదర్‌ ‌గారు ఇచ్చిన ప్రేరణతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాగ్గేయకారుడిగా పనిచేసిన సుద్దాల హనుమంతు శత జయంతి సభ నిర్వహణలో మాకు తోడుగా నిలిచారు.వారి ప్రేరణతో విప్లవ సింహం నల్ల నరసింహుడు గురించి వ్యాసాలు రాసి సభలు నిర్వహి ంచాను. ఇప్పుడు నల్ల నరసింహులు గురించి కమ్యూ నిస్టులు, పద్మశాలీల తోపాటు అనేక సామాజిక సంఘాలు తన శత జయంతి వర్ధంతి కార్యక్రమాలను స్ఫూర్తిగా జరుపుకుంటున్నాయి. విశేష అశేష త్యాగాలు చేసి మరుగునపడి ఉన్న వీరులను ఈనాటి తరానికి తెలియజేయాలి నానా.. నువ్వు ఆ వైపుగా కృషి నిరంతరం చేయాలి అని నన్ను ప్రోత్సహించారు.
2014 లో లో తెలంగాణ నవ నిర్మాణం పై దొడ్డి కొమురయ్య పౌండేషన్‌ ఒక రోజు సుధీర్గ సదస్సును నిర్వహించింది. ఘంటా చక్రపాణి ఎర్ర నరసింహారెడ్డి వంటి మేధావులు ఆ సభకు హాజరయ్యారు. ఘంటా చక్రపాణి గారి తెలంగాణ జైత్రయాత్ర పుస్తకాన్ని ఈ సదస్సులోనే ఆవిష్కరింపజేశారు. చక్రపాణి మాట్లా డుతూ ఈ పుస్తకాల్ని కెసిఆర్‌ ‌తో  కూడా ఆవిష్కరింప చేస్తానని అన్నాడు. ఉద్యమాలకు ఊపిరిలూదిన, తనకు గోప్ప రాజకీయ చైతన్యం అందించిన వరంగల్‌ ‌లోనే ఆవిష్కరణ చేయాలని అనుకున్నాను. ‘‘ఈ పుస్తకాన్ని రెండు దశల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జగన్నాధ దామోదర్‌ ‌గారిచే ఆవిష్కరింప చేసుకోవడం నాకు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చాయి అని అన్నారు.’’ రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షనర్లు వారి జీవన భద్రత పటిష్టంగా ఉండాలని తపించి వారి కోసం ఒక మహా సభను నిర్వహించారు. వారి పెన్షన్‌, ‌సర్వీసులలో సమస్యల పరిష్కారం కోసం ఒక సహాయక కార్యాల యాన్ని హన్మకొండ కలెక్టర్‌ ‌ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా దామోదర్‌ ‌జీవితంలో లో మరొక అపూర్వ అంశంగా నిలిచిపోతుంది.

మాజీ మంత్రి వర్యులు తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌స్వామి గౌడ్‌ ,ఏలూరి శ్రీనివాస రావు, పరిటాల సుబ్బారావు, దేవి ప్రసాద్‌, ‌రవీందర్‌ ‌రెడ్డి, మామిళ్ల రాజేందర్‌ ‌వంటి ఉద్యోగ సంఘాల అగ్రనేతలందరు గౌరవంగా దామోదరన్న గా పిలుచుకొని వారి ప్రస్థానాన్ని కరదీపికగా మారారు. ఉద్యమ ఉద్యోగ సంఘం నేతగా పాటు నిస్వార్థ మానవీయ సంబంధాల మనుగడ కోసం తపించే వాడు. స్థాయిలతో సంబంధం లేకుండా మనుషు లందరికీ ఒక్కటే విలువ అని జీవితమంతా పాటించాడు. సమీకరణ శక్తి లేకుండా, ఆచరణ లేని జ్ఞానంతో నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులపై మారడానికి ప్రేమపూర్వక మందలింపులు చేసేవాడు. ఒకప్పుడు తాను నమ్మిన వర్గాల కోసం పోరాటం చేసే ప్రజా నేతలకు ఉద్యోగ సంఘ నాయకులు అండగా ఉండే ధోరణి బాగా ఉండేది. ఇప్పుడు ఆ ధోరణి క్రమేపి తగ్గుతున్న సందర్భం కనిపిస్తున్నదని ఆవేదన చెం• •వాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యోగ సంఘాల నాయ కులు ఉద్యోగుల సమస్యలతో పాటు ప్రజా సమ స్యల పట్ల స్పందిస్తూ వారి కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను గౌరవించడం కొనసాగించాలని హితవు పలికాడు.తన జీవిత కాలంలో ఆచరించాడు.

ఆవేదన చెందేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలతో పాటు  ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారి కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను గౌరవించడం కొనసా గించాలని హితవు పలికాడు.తన జీవిత కాలంలో ఆచరించాడు. జీవితాన్ని ఉద్యమంగా మలుచుకుని ఉద్యమ జీవితానికి వ్యక్తిగత జీవితానికి వ్యత్యాసం లేకుండా జీవించిన మహనీయుడు జగన్నాధదామోదరుడు. ఉద్యోగ సంఘాల నేతలు ఎలా ఉండాలో మార్గం చూపిన దారి దీపం జగన్నాథుడు.వారికి జోహార్లు, వారి బాటలో పయనిద్దాము.
image.png
అస్నాల శ్రీనివాస్‌
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *