అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

dr burra madhusudhan reddyయూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి పోయా రు. యూఎస్‌ ఉపాధ్యక్షురాలిగా కమల హారిస్‌ ‌ప్రస్తుతం పదవిలో కొనసాగడం మనకు విధితమే. ప్రవాస భారతీయులుగా ఇతర రంగాల్లో సుందర్‌ ‌పిచ్చయ్‌, ‌సత్య నాదెళ్ళ లాంటి టెక్‌ ‌కింగ్స్ ‌ప్రపంచ అగ్ర కంపెనీల సిఈఓలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ ‌పౌరులు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు ‘వివేక్‌ ‌రామస్వామి’, ట్రంప్‌ ‌ప్రభుత్వంలో ప్రముఖ పాత్రను పొషించిన మహిళ ‘నిక్కీ హెలీ’, ఎరోనాటికల్‌ ఇం‌జనీరు ‘హర్ష్ ‌వర్థన్‌ ‌సింగ్‌’ అనే ముగ్గురు ప్రవాస భారతీయులు రిపబ్లికన్‌ ‌పార్టీ నుంచి 2024లో జరుగనున్న అమెరికన్‌ అధ్యక్ష బరిలో దిగేందుకు డొనాల్డ్ ‌ట్రంప్‌తో పోటీ పడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

వివేక్‌ ‌గణపతి రామస్వామి:
భారతీయ సంతతికి చెందిన కేరళ, పాలక్కాడ్‌ ‌జిల్లాకు చెందిన హిందూ కుటుంబంలో సిన్సినాటీ, ఓహియో నగరంలో ఇంజనీరు గణపతి రామస్వామి, డా: గీత రామస్వామి దంపతులకు 09 ఆగష్టు 1985న జన్మించిన 37- ఏండ్ల వివేక్‌ ‌గణపతి రామస్వామి హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయం నుంచి బిఏ, యేల్స్ ‌లా కళాశాల నుంచి జె.డి. డిగ్రీ పట్టాలు పొందిన ఔత్సాహిక సాంకేతిక నిపుణుడిగా బయోటెక్‌ ‌కంపెనీ స్థాపించి సిఈఓగా మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం ‘స్ట్రైవ్‌ అసెట్స్ అసెస్‌మెంట్‌’ ‌కంపెనీ ప్రారంభించి పలు పర్యావరణ హిత సేవలు కూడా చేశారు. రాబోయే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ ‌పార్టీ తరపున వివేక్‌ ‌రామస్వామి అధ్యక్ష పదవికి పూర్వ అధ్యక్షులు డొనాల్డ్ ‌ట్రంఫ్‌, ‌ఫ్లోరిడా గవర్నర్‌ ‌రాన్‌ ‌డీసాంటిస్‌లతో గట్టిగా పోటీ పడుతున్నారు. చైనా ఆదిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికా గత వైభవాన్ని నిలుపుతానని పలు టీవీ, ఆన్‌లైన్‌ ‌ప్రసంగాల్లో తన అభిప్రాయాలను ప్రజల స్పష్టంగా వివరిస్తూ మెప్పును పొందేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. డా: అపూర్వ రామస్వామి (ఫిజీషియన్‌)‌ని వివాహమాడిన వివేక్‌ ‌రామస్వామి వ్యక్తిత్వం, అభిప్రాయాలు అమెరికా ప్రగతికి ఉపయుక్తంగా, ఆశాజనకంగా ఉన్నాయని ప్రముఖ టెస్లా కంపెనీ అధినేత, సీఈఓ, బిలియనీర్‌ ‘ఎలాన్‌ ‌మాస్క్‘ ‌కూడా ప్రకటించడంతో అమెరికన్ల దృష్టి రామస్వామి అభ్యర్థిత్వం వైపు మళ్లడం జరుగుతున్నది. రిపబ్లికన్‌ ‌పార్టీ అధ్యక్ష పదవి పోటీలో  డొనాల్డ్ ‌ట్రంఫ్‌  అభ్యర్థిత్వంలో ముందంజలో ఉన్నప్పటికీ అతనిపై కొనసాగుతున్న కోర్టు కేసులు కొంత అడ్డుపడే అవకాశం ఉండవచ్చని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. హిందూ మతాన్ని ఆచరిస్తున్న రామస్వామి భగవంతుడి పట్ల భక్తిని కలిగి అంటూ మాతృభాష తమిళంతో పాటు మలయాళం కూడా మాట్లాడగల శాకాహారి రామస్వామి ఒక బిలియన్‌ ‌డాలర్ల సంపదను కలిగి ఉన్నాడు.

నిక్కీ హెలీ: 
భారతీయ సంతతికి చెందిన మరో రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న 57- ఏండ్ల మహిళ ‘నిక్కీ హెలీ‘ గతంలో సౌథ్‌ ‌కరోలినా గవర్నర్‌గా కూడా సేవలు అందించారు. ట్రంఫ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రముఖ పాత్రను నిర్వహించిన హెలీ ప్రస్తుతం అధ్యక్ష పదవికి జరుగబోయే రేసులో ఉండడం గమనించాలి. పంజాబ్‌ ‌వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్‌గా పని చేసిన అజిత్‌ ‌సింగ్‌, ‌ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ పట్టా పొందిన రాజ్‌ ‌కౌర్‌ ‌దంపతులకు 20 జనవరి 1972న వస్త్ర వ్యాపార కుటుంబంలో సౌథ్‌ ‌కరోలినాలో జన్మించిన నిక్కీ తల్లితండ్రులు పంజాబ్‌కు చెందిన వారు. తొలుత కెనడాలో పని చేసిన హెలీ తల్లితండ్రులు 1969 తరువాత అమెరికాలోకి సౌథ్‌ ‌కరోలినాలో స్థిరపడ్డారు. అకౌంటింగ్‌లో యూనివర్సిటీ డిగ్రీ పొందిన నిక్కీ హెలీ 1996లో క్రిస్టియన్‌గా మారి మైఖేల్‌ ‌హెలీని వివాహమాడారు. 2005-11 మధ్య సౌథ్‌ ‌కారోలినా హౌజ్‌ ఆఫ్‌ ‌రిప్రజెంటేటివ్‌గా, 2011-17 వరకు సౌథ్‌ ‌కారోలినా గవర్నర్‌గా, 2017-18 మధ్య ఐరాసలో యూఎస్‌ అం‌బాసిడర్‌గా సేవలు అందించారు.

హర్ష్ ‌వర్థన్‌ ‌సింగ్‌:

అట్లాంటిక్‌ ‌సిటీలో భారతీయ తల్లితండ్రులకు జన్మించిన హర్ష్ ‌న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ నుంచి 2009లో ఇంజనీరింగ్‌ ‌డిగ్రీని పొందారు. జీవిత కాలం రిపబ్లికన్‌ ‌పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్న హర్ష్ ‌వర్థన్‌ ‌సింగ్‌ ‘అమెరికా ఫస్ట్’ అం‌టూ అభిమానాన్ని ప్రకటించుకుంటున్నారు. వృత్తి రీత్యా ఎరోనాటికల్‌ ఇం‌జనీరు అయిన హర్ష్ ‌వర్థన్‌ ‌సింగ్‌ ‌కుటుంబం మెసైల్‌ ‌డిఫెన్స్, ‌సాటలైట్‌ ‌నావిగేషన్‌, ఏవియేషన్‌ ‌సెక్యూరిటీ రంగాల్లో వ్యాపారం చేస్తున్నారు. 13 మార్చి 1985న జన్మించిన హర్ష్ ‌తన ప్రతిభతో ఏవియోషన్‌ అం‌బాసిడర్‌గా అవార్డు పొందిన 38 ఏండ్ల హర్ష్ ‌వర్థన్‌ ‌సింగ్‌ ‌రాజకీయ నాయకుడిగా, ఏరోనాటికల్‌ ఇం‌జనీరుగా గుర్తింపు పొందారు.

మానవీయ విలువలకు పుట్టిళ్లు నా భారతం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గుండెల్లో పెట్టుకొని జీవించే విధానమే భారత నినాదం. ప్రేమలు పంచడం, మానవీయ సంబంధాలను అల్లుకోవడం మా అభిమతం. అమ్మ నాన్న, సోదరసోదరీమణులు, బంధువులు, స్నేహితులకు పెద్దపీట వేయడం మా అలవాటు. పెళ్లిళ్లను పరమ పవిత్రంగా భావించడం, కడదాకా దంపతులుగా విడదీయరాని బంధాలను పెనవేసుకోవడం భారత రక్తానికి తెలుసు. ఇలాంటి విశ్వ కుటుంబ భావన కలిగిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచ దేశాల అధినేతలుగా సేవలను అందిస్తే విశ్వమంతా ఆనంద నందన వనంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. నేడు అమెరికా అధ్యక్షుడిగా ప్రవాస భారతీయ రక్తం ఎన్నిక కావాలని దేశ భక్తులుగా మనందరం కోరుకుంటూ, ‘ఆల్‌ ‌ది బెస్ట్’ ‌తెలుపుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *