అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు
వీరత్వాల భానుడు
ఉద్యమాల సేనుడు
తెలంగాణ కధన భేరి
కాసోజు శ్రీకాంతాచారి

ప్రత్యేక తెలంగాణ కోసం
పోరు జెండై ఎగిరినవాడు

పర పీడన విముక్తి కోసం
రణ కెరటమై ఎగసినవాడు

వలస పాలకుల దాష్టికంపై
ధిక్కార పాటై మోగినవాడు

దోపిడీదారుల గుండెల్లో
విచ్చు కత్తై మెరిసినవాడు

బూర్జువా వ్యవస్థ మీద
ఆగ్రహ సెగలై రగిలినవాడు

ఉద్యమానికి ఊపిరిలుధి
పోరు అంటే త్యాగమని
నికార్సుగా చాటినవాడు

మంటలు చుట్టుముట్టి
తనువును దహిస్తున్నా

జై తెలంగాణ నినాదాన్ని
గొంతుకు ఎత్తుకున్నవాడు

మలిదశ మహోద్యమంలో
మృత్యువును ముద్దాడిన
తొట్ట తొలి అమరవీరుడు

కాసోజు శ్రీకాంతాచారి
కనుమరుగు అయితేనేం?

తెలంగాణ మాగాణంలో
కీర్తి సుమమై పరిమళిస్తాడు

తూరుపు కనుమలలో
స్ఫూర్తి సూరీడై ప్రభవిస్తాడు

(డిసెంబర్‌ 3 ‌న శ్రీకాంతాచారి వర్దంతి సందర్భంగా

పోరు జోహార్లు అర్పిస్తూ..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *