ప్రజలకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు
రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సిఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందనీ, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని తెలిపారు.
చిన్న పిల్లలకు హోలీ రంగులు కళ్లల్లో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ పండుగను నిర్వహించుకోవాలని సూచిస్తూ…మరో సారి హ్యాపీ హొలీ తెలిపారు.