సూర్యాపేట/జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 30 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు స్కూటీని ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. స్కూటీ, బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు.
మృతుడు ఇందిరానగర్‌కు చెందిన రాజు(45)గా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని బస్సు వెళుతోంది. మియాపూర్ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఘటన జరిగింది. కాగా.. నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో సైతం ప్రమాదం జరిగింది. వరుస ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రమాదంతో నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్-65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
చెట్టును ఢీకొన్న ట్రక్కు….ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్బుల్ లోడుతో నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. మృతులు పంజాబ్ రాష్టాన్రికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.