సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే.. మాదే

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు
కెసిఆర్‌ ‌కల సాకారమైందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌
‌కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న కాంగ్రెస్‌

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌27: ‌సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే..మాదే అంటూ.. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం అవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటిపారుదల విభాగంలో కేసీఆర్‌ ‌చేసిన కృషి మరో ఉదాహరణగా ఈ ప్రాజెక్టను చూపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ఇంజినీర్లకు, అధికారులకు, ఏజెన్సీలకు, ప్రజాప్రతినిధుల కు శుభాకాంక్షలు చెప్పారు.  మాజీ సీఎం కేసీఆర్‌ ‌కల నెరవేరిందని సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ ‌సక్సెస్‌పై  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ట్వీట్‌ ‌చేసింది. ’ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్‌ ‌కల నిజమవుతున్న తరుణం..  గత కేసీఆర్‌ ‌ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్‌ ‌రన్‌ ‌సక్సెస్‌. ‌గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల.

ఉమ్మడి ఖమ్మం మహబూబాబాద్‌ ‌జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరు.’అని అభివర్ణించింది. 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని,  కమిషన్ల కోసం రీడిజైన్‌ ‌పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేస్తిరని అంటూ కాంగ్రెస్‌ ‌విమర్శలు చేసింది. ప్రాజెక్టుకు అవసరం అయిన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, రు మాత్రం అందినకాడికి దోచుకుంటిరని  పేర్కొంది. ప్రజా ప్రభుత్వం వచ్చాక, జనవరి 7 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రాజెక్టు పురోగతిపై సక్ష నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జల కళ అంటూ ఎదురుదాడికి దిగింది. కు తెల్సిందల్లా అవినీతితో.. ఆగమాగం ప్రాజెక్టులు కట్టి, పడగొట్టడం, పంపుహౌజులను కట్టి, వరదతో ముంచెత్తడం, మంచి చేసే వారిపై దుష్ప్రచారాలతో బురద జల్లడం అని విమర్శించింది. ఇప్పడు చెప్పు.. కాంగ్రెస్‌ ‌వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కల వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే అని పేర్కొంది.  ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్‌ ‌బ్యారేజ్‌ ‌నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్‌ ‌హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సీతారామ ప్రాజెక్ట్ ‌ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందనుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ముందు చూపుతో ఇదంతా సాధ్యం అయిందన్నారు.  అయితే కేటీఆర్‌ ‌కు కాంగ్రెస్‌ ‌కౌంటర్‌ ఇచ్చింది. 2014 లోనే రూ.3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని,  కమిషన్ల కోసం రీడిజైన్‌ ‌పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. జా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్ట్ ‌పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెల్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జలకళ అని పేర్కొంది.

ఇప్పుడు చెప్పు.. కాంగ్రెస్‌ ‌వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కళ వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే!’ అని కాంగ్రెస్‌ ‌ట్వీట్‌ ‌చేసింది.అయితే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను గురువారం నిర్వహించగా, విజయవంతమైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఓ ‌ట్వీట్‌ ‌చేశారు. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసీఆర్‌ ‌మహాసంకల్పం నెరవేరిన రోజు ఇది అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు తన గుండెకాయ అని కేసీఆర్‌ ‌గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయినికి కేసీఆర్‌ ‌జీవం పోశారని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించి, పటిష్ఠ ప్రణాళికను తయారు చేసి యుద్ధ ప్రతిపాదికన అమలు చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌ ‌జిల్లాల్లోని.. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇక ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు.. దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కాలమైనా.. కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు రానున్నాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌కలను సాకారం చేసి.. ఈ ‘జలవిజయం‘లో భాగస్వాములైన.. నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు.. కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. జై తెలంగాణ.. జై సీతారామ ప్రాజెక్టు అంటూ కేటీఆర్‌ ‌తన ట్వీట్‌ను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *