సింగిల్‌ ‌పిక్‌ ‌కాటన్‌ ‌సాగు ప్రోత్సాహం

  • రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటి
  • కార్యాచరణపై అధికారులతో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సమావేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగు చేయించాలని అధికారులను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్ ‌నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలని అన్నారు. సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రైతులను చైతన్య పర్చాలని సూచించారు. రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్‌ ‌పిక్‌ ‌కాటన్‌ ‌ప్రమోషన్‌పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి బుధవారం సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌బీఆర్‌కేఆర్‌ ‌భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తిని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందనీ పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంటను వేస్తున్నారని ఈ సందర్భంగా సిఎస్‌ ‌వివరించారు. హెచ్‌డిపిఎస్‌ (‌హై-డెన్సిటీ ప్లాంటింగ్‌ ‌సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సిఎస్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి, ఈ సింగల్‌ ‌పిక్‌ ‌పత్తిని సాగు చేసే రైతుల నమోదు చేయించాలని ఆదేశించారు. దీనికై రైతు ప్రొఫైల్‌, ‌వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్‌ ‌తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం రఘునందన్‌ ‌రావు, పీజేటీఎస్‌ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, స్పెషల్‌ ‌కమిషనర్‌ అ‌గ్రికల్చర్‌ ‌హనుమాన్‌ ‌కె జెండగే, హార్టికల్చర్‌ ‌కమిషనర్‌ ‌వెంకట్రామ్‌ ‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *