Take a fresh look at your lifestyle.

సాహితీవేత్త రేగులపాటి కిషన్‌ ‌మృతి

అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లా కు చెందిన సాహితీవేత్త … ప్రముఖ కవి నవలా రచయిత రేగులపాటి కిషన్‌ ‌రావు  (77) గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన ఇప్పటికీ 4 నవలలు 6 కథా సంకలనాలు 13 కవిత్వ సంకలనాలు వెలువరించారు. సంఘసంస్కరణ  అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సాగాయి  గత ఏడేళ్లుగా అనారోగ్యంతో దాదాపు మంచం పైనే ఉన్నారు. ఆయన శ్రీమతి రేగులపాటి విజయలక్ష్మి కూడా ఆయన స్ఫూర్తితో రచనలు చేశారు. ఆయన 1946 డిసెంబర్‌ 1‌న ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల టానా  లో జన్మించారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి కరీంనగర్‌ ‌రాంనగర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తన రచనలపై ఒక పిహెచ్డి కూడా వెలువడింది.

కథక చక్రవర్తి 2008, సంస్కారం కథలు 2012,  ఈ తరం పెళ్లి కూతురు 2013, అన్వేషణ 2014, పరిమళించిన మానవత్వం 2014, నవచైతన్యం 2016 తదితర కథల సంపుటాలు వెలువ రించారు. ప్రగతి పాటలు (1982), కవితా పుష్పాలు (1984), కొత్తపాటలు (1985), మల్లెమొగ్గలు (1986), రవిబింబం (1989), పాడవే కోకిలా! (1996), కలం బలం (1996), మనధర్మం (1997), సజీవ సత్యాలు (1997), కాంతిపుంజం (1999), ప్రగతి రథం (2001), గెలుపొందిన పావురం (2001), అక్షర సౌజన్యం (2010), విజయరాగ్‌ (‌కవితలు) కవితా సంకలనాలు వెలువరించారు. ఆమె వితంతువు కాదు (1976),  పతివ్రత ఎవరు? వాణిశ్రీ (1978), సంఘర్షణ (1981), ప్రేమకు పెళ్ళెప్పుడు? (1982) తదితర నవలలు రాశారు.

వ్యాసమంజరి (1989), సాహితీ సౌరభం (2007), భాగవత విషసర్పం (1980),  మా ఢిల్లీయాత్ర (కథాంజలి సీరియల్‌ (1986-1997) ఆయన కలం నుండి జలువారినవే. ఉత్తమ కవితా బహుమతి : తెలుగు సాహితీ సమాఖ్య, కాకినాడ, (1985) సినారె సాహితీ పురస్కారం, సిరిసిల్ల (1995), ఉత్తమ కవితా అవార్డు : భావ తరంగిణి మాసపత్రిక, మచిలీపట్నం (2005), మలయశ్రీ ప్రగతిశీల సాహితీ అవార్డు: నవ్య సాహిత్య పరిషత్‌ ‌కరీంనగర్‌ (2009), ‌ప్రపంచ తెలుగు మహాసభలు: ప్రభుత్వ పురస్కారం (2012), రంగినేని సుజాత మోహన్‌ ‌రావు ట్రస్ట్, ‌సిరిసిల్ల బాలసాహితీమూర్తులు ఆత్మీయ సత్కారం 2017, ఈగల్‌ ‌ట్రస్ట్ ‌కరీంనగర్‌ ‌గారి ఉగాది సన్మానం, బహుమతి (2013), నారదాసు లక్ష్మణరావు – ఉగాది పురస్కారం (2013) ఇతర సన్మానాలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు.మొదట బహు భాషా వేత్త డాక్టర్‌ ‌నలిమెల భాస్కర్‌ ‌తో కవిత్వ రచన ప్రారంభించారు. ఆయన మృతి పట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కవులు రచయితలు సంతాపం తెలిపారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply