మిణుగురుల పెంపకాలు
ఈల్‌ ‌చేపల సాగులు!
ప్రాణవాయువు పంటకాలు
అమృతజలాల వంటకాలు!
నవతరం వంగడాలు ఇవేనేమో?
మంచు ఖండాలు
హిమవత్‌ ‌శిఖరాలు!
సరయు సరస్సులు
ఆరామ విరామాలు!
చిత్రపటాల్లోనే మిగులుతాయేమో?
వేకువ భయమేలేని తిమిరాలు
పున్నమి అయిపేలేని ఆకసాలు!
రాలిపోతున్న తారలు
రగిలిపోతున్న గగనాలు!
వాస్తవంలో ఎదురవుతాయేమో?
గుడ్డి నక్షత్రాల వెలుగులో
ముఖాలు చూసే వేళని!
మెరుపు మెరిసిన కాంతిలో
పండుగలు చేసే కాలాన్ని!
లాంతరు పట్టే సూరీడిని
శీతల గదుల్లో దూరే చంద్రుడిని!
అతి త్వరలో దర్శిస్తావేమో?
వెలుగే ఉండదు వేడిమి తప్ప
సొబగే ఉండదు సెగడి తప్ప!
ఉపశమనం లేని రోగాలు తప్ప
ఉపశాంతి లేని తాపాలు తప్ప!
భాద్యత లేని మానవుడు
భావితరాలకు ఇచ్చే కానుకలు!
విచ్చలవిడి తనానికి
విధ్వంసపు మనస్తత్వానికి
మిగిలిపోయే ఆధారాలు!
నవ్వుతూ చేసిన పాపాలు
ఏడుస్తూ భరించే శాపాలు!
అనుభవించే రోజులు
సమీపిస్తున్నాయి!
సమీపిస్తున్నాయి!

– ఉషారం, రాజమహేంద్రవరం
9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page