రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని..
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనిక స్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కొరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్ !
అని అంటాడు శ్రీశ్రీ
మేడే రావడానికి ఒక రోజు ముందు పుట్టినాడు శ్రీశ్రీ.
పత్రికలు నడిపే వారు, కార్మిక సంఘాలు, పనిబతికే వారికోసం, యాజమాన్యాలు నానాటికీ మహామహా దోపిడీ కంపినీ, కార్పొరేషన్ మెగా సంపన్నులు ద్వేషించేవారు, కార్మిక లోకం ప్రేమించుకుంటూ ఉండేవారు ఈ నెల మే డే ఉంటుందని చాలామందికి తెలుసు (అని అనుకుంటున్నాను సారీ). శ్రీ శ్రీ ని గుర్తుచేసుకోవలసిందే కదా.
కాని. ఏం చేసుకోవడానికి. పాత చరిత్ర గొప్పగా ఉందని ఓహో అని చెప్పుకునేది ఏముంది? మే డే అంటే కార్మికులు తన హక్కులు నిలబెట్టుకునే నియమాలు చట్టాలు శాసనాలు ఉన్నాయని అనుకునే వారం.
కార్మిక రాజ్యాంగం
కార్మిక రాజ్యాంగం అనే పేరు లేదు. కాని రాజ్యాంగంలో కార్మికుల హక్కులను కాపాడుకునే చట్టాల ద్వారా 1950 రాజ్యాంగంలో చేర్పించారు. అంబేడ్కర్ వంటి ఆ పేరుతొ అనకపొయినా కార్మిక రాజ్యాంగం వంటి లక్షణాలు కొన్ని ఉంచిన వారు ఉన్నారు. కొందరు నాయకులు కూడా కొంతగా ఉంచారు.
కాని ఇప్పుడు రాజ్యాంగం ప్రభువులు కార్మిక రాజ్యంగం లేకుండా చంపేశారు. ఒకప్పుడు కార్మిక చట్టాలు, సమ్మె చట్టం ఉందని అనుకునేవాళ్లం. ప్రభుత్వం కాదు, యాజమానులు కాదు, హైకోర్టులు మరికొందరు గొప్ప జష్టిస్ అనబడే మహాఘనులైన తీర్పులు న్యాయమూర్తులనే వారు న్యాయం చెప్పేవాళ్లు. అప్పుడు కొన్నాళ్లు కూడా హక్కులు కూడా ఉండేవి. లేదా అని చెప్పుకోవడానికి ఒక గత చరిత్ర అని రాసుకునేందుకు వీలవుతుంది. అంతే.
ఇదివరకు చాలాహక్కులు ఉన్నాయి. అది న్యూసెన్స్ అని ప్రభుత్వాలు పెద్దలు ప్రస్తుతం అనుకుంటున్నారు. అనుకోవడం కాదు. కొత్త కొత్త చట్టాలు చేసిపడేసారు. అవి కూడా రాజ్యాంగం ప్రకారం చట్టాలు ఉన్నాయి. పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభాలు చట్టాలు ఉన్నాయి.
ఇప్పుడు తెలుసుకోవాలంటే శ్రీశ్రీ విప్లవ నినాదాలు. కాని హక్కేలే లేవు అని ఈ గేయం వివరిస్తున్నది.
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలవ కట్టే ఘర్మ జలానికి,
ఘర్మ జలానికి,
ధర్మ జలానికి,
ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ !
కార్మిక చట్టాలని కొందరంటే ఆ తరువాత పరిశ్రమ చట్టాలు ఇండస్ట్రియల్ చట్టాలు అన్నారు. ఆ తరువాత అన్నీ తీసేసి కేవలం నియమాలు అన్నారు. లేదా యాజమానులు పరిశ్రమ కార్పొరేట్ దయ్యం బూతాలంత పెద్ద కంపెనీలు తినేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపినీ ప్రభువుల పాలనే బాగుందనుకునే గొప్ప కొత్త చట్టాలు తెచ్చుకున్నారు, అవన్నీ భారతీయ పార్టీలు, అంటే రాజ్యాంగం ప్రకారం రచిస్తున్న పార్టీలు కలసి చేసుకున్న చట్టాల రాజ్యాంగ చట్టాలు అంటున్నారు. దారుణం.
కాంక్రీట్ న్యాయ చట్టాలు కదా. కాంక్రీట్ విగ్రహాలు
రాజ్యాంగం ఇంకా ఉందని కొందరు అనుకుంటున్నారు. లేవని చెప్పడానికి అంబేడ్కర్ పేరొకటి ఉంచుకుంటున్నాం. విగ్రహాలు చేసుకుంటున్నాం. కాని ఆ మహానుభావుడిని మొక్కుకుంటున్నాం. కాని చట్టాలు పీకిపడేసారని ఎవరూ గుర్తుచేసుకోవడం లేదు.
పాపం అంబేడ్కర్ ఆ రాతి, లోహపు, స్టీల్, సిమెంట్ విగ్రహాలలో ఆత్మ (ఆత్మలా, ఉంటాయా? హేతు సంఘాల వారిని అడుగుదాం) ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మనకు రోజూ పత్రికలో ఏం రాసుకుంటామో తెలుసా. మన విలేఖరులు, పాత్రికేయులని గర్వంతో చెప్పుకుంటున్నాం కదా…(వాళ్లకు హక్కులే లేవని ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, వారికి అది కూడా తెలియదు) ఆత్మహత్యల గురించి రాస్తున్నాం కదా. ఆత్మకు హత్యమేమిటి అసలు? కార్మిక నాయకులు సామన్యులైన కార్మిక వీరులు అని మనం అనుకున్నాం కదా, వారు కూడా డబ్బులేక, పేదరికంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదిగో ఆత్మహత్య అనీ మళ్లీ అంటున్నాం. ఆత్మ ఎక్కడుంది, అధికార పార్టీలోనా, రాజ్యాంగంలోనా లేక నేను చెప్పే లావుగా ఉండే లా పాఠాల్లో చెపుతున్న లెస్సన్స్ లో ఉన్నాయా.
నేను ఉండే గాంధీనగర్ (అంటే అహ్మదాబాద్ అంటే మన గాంధీ పుట్టిన దేశం రాజ్యం అని కాదు, ప్రతి జిల్లాల ఓ వాడవాడన గాంధీనగర్ పేర్లతో ఉన్నారు కదా. అందులో ఒక పేరు నేను ఉండే చోటు) ఐ ఎ ఎస్ లో చదువుకుని గెలిచి దేశాన్ని పరిపాలించడానికి భట్టీ పట్టేసేకుంటారు చూడండి అందులో రాజ్యాంగం గురించి చెబుతున్నారో లేదో గాని అది లేదని తెలుస్తుంది.
పాపం కార్మిక సంఘాల వారు, పాత్రికేయుకాలు స్పెషల్ మే డే అని కొందరు గురించి వ్వాసాలు, ప్రత్యేక పత్రాలు అచ్చు చేద్దామంటున్నారు కొందరు. పాతకాలం పాల పాతకులను గురించి ఏం రాయను.
ఎవరితోనూ మాట్లాడకుండా, అమ్మాయి పిల్లలు ఎవరికీ కనబడకుండా, ప్రొద్దు నుంచి రాత్రిదాకా చదువుకుంటున్నారు. ఐ ఎ ఎస్ పరీక్షలు పాసై కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పాసై పోతున్నారు కూడా. కాని వందల మంది వేలవేల యువకులు ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది ఏ ఉద్యోగాలు లేకుండా లక్షల మంది ఉంటున్నారు. బోలెడన్నిడబ్బులు ఇచ్చుకుని ఐ ఎ ఎస్ అవుతామని కోరుకుంటున్నారు. కలలు కొంటున్నారు. చాలా మంది గొప్ప లెక్చరర్ చేసే వారు బ్రహ్మాండమైన లెక్చర్ లు కూడా ఏళ్ల కాలం గడిచిపోతున్నాయి. కష్టపడి లెక్చర్ లు దంచుతున్నారు. వాళ్లు పాఠాలు చదివిస్తారు. ఏ పాఠాలు? అందులో రాజ్యాంగ పాఠాలు ఉంటాయి. ఉదాహరణ: అంబేడ్కర్ జీవితం ఒక పాఠం. నిజం. అది అంబేడ్కర్ అంటే కేవలం ఒక పాఠం. ఒక లెక్చర్, దానికి చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు.
అయినా అర్థం కాదు కనుక ఒక పెద్ద విగ్రహం. (దాని ముందు చిన్నబోయిన ఇందిరాగాంధీ, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఇంకా చిన్నబోయిన విగ్రహాలు ఇప్పుడెవరైనా చూస్తారా అని). కోచింగ్ దుకాణాల్లో భట్టీ కొట్టి, ఎన్ టీ రామారావ్ వలె మయసభ డైలాగ్ లు కొట్టినట్టు, అందరం చప్పట్లు కొట్టినట్టు, ఏం చేద్దాం బద్రర్. వాళ్లను ఏమనాలి. ఆ లెక్చరర్ వారికి నిజంగా అర్జెంట్ గా పది సన్మానాలు చేయాలి. కాని ఎవరూ చేయరు. వారికి సరైన జీతాలు ఇస్తారా, ఆ కంపినీవారు లాభాలు చేసుకుంటారు. మొదటి నుంచి వందలదాకా రాంక్ లు బోలెడు తమ కంపినీకే వచ్చాయని చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ప్రకటనలు చేస్తున్నారు. అవి చదివి ఇంకా కొన్ని లక్షల మంది ఐ ఎ ఎస్ లేదా ఐ పి ఎస్ చదువుకుంటున్నారు. వచ్చిందని రాలేదని ఎందరో నిరాశ పొందుతున్నారు కూడా. ఫెయిల్ అయిన వారు, దేవదాస్ వలె మందుగొట్టిన పార్వతి వలె, ప్రియుడి వలె, సాధించ లేని ఐ ఎ ఎస్ నిరాశలతో, మందుగొట్టి లేదా ఆత్మహత్య చేసుకోకండి, యువతీ యువకుల్లారా. బతకండి, దేశాన్ని నిలపండి. పోతే పోయింది ఐ ఏ ఎస్. కాని జీవితం గొప్పది.
అందుకని, కాబట్టి
మీరంతా కార్మిక చట్టాలు లేవని తెలుసుకోండి. కంపినీల హక్కులు మాత్రమే ఉన్నాయని తెలుసుకోండి. నకిలీ కంపినీలు ఉంటాయి. కార్పొరేషన్ల మీద మరో కార్పొరేషన్లు ఉంటాయి. మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. వాళ్ల మీద డజన్ల క్రిమినల్ కేసులు వస్తాయి. ఉంటాయి, పోవు. కింది కొర్టు, తరువాత హైకోర్టులు, తరువాత సుప్రీంకోర్టు ముందుకు వస్తాయి. నిన్నటి సుప్రీంకోర్టు కేసులు మళ్లీ హైకోర్టుకు వస్తాయి. అంతలో ఎన్నికలు వస్తాయి. మళ్లీ వీరి మీద కొన్ని పెరిగిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏ డి ఆర్ పెద్దలు వార్తలు వ్యాసాలు రాస్తున్నారు. ప్రభుత్వాలకేంబట్టింది.
మళ్లీ భట్టి గొట్టే ఐ ఎ ఎస్ అధికారులైన వారు వారి గారై ఏమవుతారు? ఆ గారెంచేస్తారు? ముఖ్యమంత్రులు ప్రధానులు శాసనాలే చేస్తున్నవి.
మనం భట్టీ కొట్టడం. మళ్లీ ఆ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను ఆ ఐ ఎ ఎస్, (ఐ పి ఎస్ వారు కూడా) లు నోరుమూసుకుని ఏం చెప్పినట్టు బుద్ధిగా (బుద్దిగా లేకుండా అందామా) బతకాలి కదా మరి.
కనుక మనం ఏం వివరించాలంటే…
మనకు పెట్టుబడులు పెంచాలి, కనుక అడ్డంగా వాటిని ఆపే హక్కులు పీకి పడేయ్యాలి.
ఇప్పుడున్న పాత ఉద్యోగాలు రక్షించుకోకండి ప్రయత్నం చేయండి కాని కొత్త ఉద్యోగాలు ఇవ్వకండి.
ఇదివరకు డ్రైవర్ ఉద్యోగంలో ఉన్నవాడికి పెద్ద జీతాలు ఇవ్వకండి. ఓ 20 వేలో కొంచెం తక్కువే ఇవ్వండి. వాడు నోరుమూసుకుని పనిచేస్తాడులే.
కార్మికులు, వారి సంఘాలు, లేబర్ చట్టాలు, ఆఫీసర్లు ఏమిటా నాన్ సెన్స్. రెడ్ టేపిజం ఇక ఆపండి. ఈ చట్టాలు, దానిగురించి కేసులు పెట్టడం, సుప్రీంకోర్టుదాకా వాదించేయడం, ఏమిటా ప్రశ్న. ముఖ్యమంత్రులు కోర్టుల్లో బెయిల్ అన్నీ హాయిగా గెలుచుకుంటారులే.
అని పత్రికల్లో, మంత్రులు, నాయకులు చెబుతున్నారు కదా. ఇంకా ఎందుకు రాయడం, వినడం. మే డే గురించి ఎర్ర జెండాలు, ఎర్ర ఎర్రి సినిమాలు. (ఎర్ర సైన్యం ఆర్.నారాయణమూర్తి గారు సారీ) కనుక ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్ 2020 అన్నారు. అంటే పరిశ్రమల సంబంధాల (మంచి అని నేను అనుకున్నాను. అది లేదు) కోడ్ అంటే బోలెడు చట్టాలు ఒక్క గుంప గుత్తగా హోల్ సేల్ చట్టాలు మార్చిపడేసారు. ‘‘తాంబూలాలు చేసేసుకున్నారు. ఏం చేస్తారో చెప్పిచావండి’’ అని ఆ మహాభావుడు, ఇంకా మహాకవి అని పేరు. గురజాడ అప్పారావు కవి 150 ఏళ్ల పాత నుంచైనా వాడుకుంటున్నాం. అందరూ అప్పులు చేసుకుంటున్నారు. అప్పారావుగారేంచేస్తాడు. కాపీ చట్టం కొట్టి పారేస్తున్నారు.
ఇంకా చాలామంచి పేర్లున్నాయి. సోషల్ భద్రతా కోడ్ బిల్లు, పనిచేసే చోట్ల రక్షణ ఆరోగ్య చట్టాలు వంటి బ్రహ్మాండమైన చట్టాలు చేసారు. ఎంత గొప్ప పేర్లు. అద్భుతం. ఇటువంటి రాసిందెవరో తెలుసొ, మన గాంధీనగర్ సందు గల్లీల్లో, ఓహ్ గంటకోసారి కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. (మధ్య మధ్య ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు కూడా) ఐ ఎ ఎస్ అధికారులు అవుతున్నారు కావడానికి.
తరువాత డాక్టర్ నాగేశ్వర్ రావుగోర్లు బోలెడంత కడుపు రోగాలు వచ్చి మళ్లీ లంచాలు తీసుకున్న డబ్బులన్నీ వాళ్లకే ఇచ్చుకుంటారు. అందులో కడుపుల్లోకి గొంతుల్లో కి ఎక్కించి కెమెరాలో కళ్లతో చూసి రోగాలు తెలుసుకుని) పుట్టగొడుగుల వలె, పుట్టుకొస్తున్న కోచింగ్ వీరుల గెలిచిన తరువాత రాసుకునే కొత్త అందమైన చట్టాలు రచించిన వారు.
అంబేడ్కర్ కు దండాలు పెట్టుకుని, జనం అంతా అమెరికాకో దూబాయ్ కో భాయీలు పారిపోతున్నారు. మేరా భారత్ మహాన్ అనుకొని నోరుమూసుకోవడం పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్.
పొలాలనన్నీ ,
హలాల దున్నీ ,
ఇలాతలంలో హేమం పిండగ ••-
జగానికంతా సౌఖ్యం నిండగ ••-
నరాల బిగువూ ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని ,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని •••
నిరపరాధులై దురదృష్టంచే
చెరసాలలో చిక్కే వాళ్ళు ….
లోహ రాక్షసుల పదఘట్టనచ్చే
కొనప్రాణంతో కనలేవాళ్లు ….
కష్టంచాలక కడుపుమంటలే
తెగించి సమ్మెలు కట్టేవాళ్లు ….
శ్రమ నిష్పలమై ,
జని నిష్టురమై ,
నూతిని గోతిని వెదికే వాళ్ళు బిబిబిబి
అనేకులింకా అభాగ్యులంతా ,
అనాథలంతా ,
అశాంతులంతా
ధీర్ఘశ్రుతిలో , తీవ్ర ధ్వనితో
విప్లవ శంఖం వినిపిస్తారోయ్ !
రాబందుల రెక్కల చప్పుడు
పొగ గొట్టపు భూంకార ధ్వని
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఝంఝానిల షడ్జధ్వానం
ఖడ్గమృగోదగ్ర విరావం
కావాలోయ్ నవ కవనానికి
మే డే గుర్తుంచుకోండి. శ్రీశ్రీ ని గుర్తుంచుకోండి.
– మాడభూషి శ్రీధర్