రోశయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌

పోటీ పడి స్పీచ్‌ ఇవ్వడంలో ఆయనే మాకు స్ఫూర్తి
నగరంలో ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే నాడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ తో తెలంగాణ ఏర్పడిరదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్య మంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. చుక్క రామయ్య, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, రోశయ్య వంటి  ఉద్ధండుల మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు తాను భయపడ్డానని, శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్‌ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య తనకు ఇచ్చారని తెలిపారు. నీటి పారుదల శాఖపై మండలిలో తాను మాట్లాడినప్పుడు తనను రోశయ్య తన ఛాంబర్‌ కు పిలిపించుకొని ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికీ మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య తనను ఆనాడు ప్రోత్సహించారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరిం చాలని రోశయ్య తనకు సూచించినట్లు పేర్కొన్నారు.

చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడిరదని, ప్రతి పక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదని, సీఎంగా, గవర్నర్‌గా, వివిధ హోదాల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారని కొని యాడారు. తమిళనాడు గవర్నర్‌ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు.. కానీ రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారని చెప్పారు.  ఆనాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచ శారని, రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటని అన్నారు. ప్రతిపక్షాల నుంచి వొచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు.

నెంబర్‌ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం రోశయ్య ఏనాడూ తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే  క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్య మంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. ఆయన నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వొచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు.

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్‌  అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యా పారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది. రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్‌ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు.  హైదరాబాద్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం.  రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లవుతుందని అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page