చెమటబిందువులు
చిందించిన సేద్యం
రెక్కల ముక్కలు
కరిగిన రక్తపు ఏరులు
కనులు చెమ్మగిల్లిన
కాయ కష్టం
అప్పుల ఊబి నుంచి
బయట పడే వైనం
చేతికొచ్చిన శ్రమ ఫలితం
నోటికందే సమయం
విసిరిన పులి పంజా
విరుచుకు పడిన
మిచౌంగ్ తుఫాన్
అపార పంట నష్టం
కలిగించింది
అన్నదాతలను
సర్వనాశనంచేసేసింది
రైతన్న నడ్డి విరిచేసింది
కర్షకుడి ఇంట్లో
విషాదం నింపేసింది
రైతన్న కంట్లో కన్నీటి
గోదావరి అయింది
-గాదిరాజు రంగరాజు
(న్యూజెర్సీ)