రెండురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

అప్రమత్తం అయిన జిహెచ్‌ఎం‌సి సిబ్బంది
నగరంలో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూన్ 27: ‌నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం  భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌ప్రగతినగర్‌, ‌బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, ‌మైత్రీవనం, అర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, ‌దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, ‌హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రాగల వారంరోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిజామాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, ‌హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితలగాలులు వీస్తాయని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌జిల్లాల్లో ఉపరితల గాలులువీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌సిద్దిపేట, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్‌ ‌వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *