రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కుంటాం

  • 3 మెడికల్‌ ‌కళాశాలల సంఖ్యను 33కు పెంచాం
  • ప్రజారోగ్య రంగంలో అన్ని స్థాయిల్లో వసతులు అప్‌‌గ్రేడ్‌
  • ‌వైద్యులు, సిబ్బందికి అవార్డుల కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు
ప్రతీ వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయనీ, నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్లు వైద్య శాఖలో జరుగుతున్న మంచి బయటికి రావడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. అందుకే నిబద్ధతతో పనిచేసే సిబ్బందిలో కొందరిని గుర్తించి వారిని సన్మానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ మెడికల్‌ ‌కళాశాలలో ఉత్తమ వైద్యులు, సిబ్బందికి మంత్రి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ ‌తరువాత ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై దృష్టి సారించాయని చెప్పారు.అభివృద్ధిలో సాటి లేదనే అమెరికా, ట్రిటన్‌ ‌వంటి దేశాల్లో సైతం శవాల దిబ్బలు చూసిన మన దేశంలో ఆ పరిస్థితి రాకుండా చూడగలిగామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారనీ, ఇందలో భాగంగా ఉమ్మడి రాస్ట్రంలో 3 ఉన్న మెడికల్‌ ‌కళాశాలల సంఖ్యను 33కు పెంచామని వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో ఒక్క సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదనీ, ఇప్పుడు 4 టిమ్స్, ‌నిమ్స్‌లో 40 ఎకరాల స్థలంలో 2 వేల పడకలతో విస్తరణ, వరంగల్‌లో హెల్త్ ‌సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంబీబీఎస్‌, ‌సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్లను పెంచి భవిష్యత్తు సమాజానికి వైద్యులను అందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానాలు కన్నతల్లిలా సేవలు చేస్తున్నాయనీ,రోగి ఎలాంటి స్థితిలో దవాఖానాకు వచ్చినా అక్కున చేర్చుకుని వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు.పిహెచ్‌సి నుంచి టీచింగ్‌ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌వరకు అందరి దగ్గర డబ్బు పెడుతున్నామనీ, సొంత నిర్ణయం తీసుకుని సదుపాయాలు కల్పించాలని చెప్పామని తెలిపారు.
వసతులు వచ్చాయి కాబట్టి సిబ్బంది పనితీరు పెరగాలనీ, బాగా పనిచేసే వాళ్లను గౌరవిస్తాం, చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరి తప్పు వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు రావొద్దని స్పస్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌దవాఖానాలలో సి సక్షన్‌పై ఆడిట్‌ ‌నిర్వహిస్తామనీ, తగ్గకపేతే సంబంధిత వైద్యులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *