వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:వికారాబాద్ పట్టణంలో నేపాల్ కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అతని నుండి వచ్చే దుర్వాసన స్థానిక వ్యాపారులు భరించలేక వికారాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ భర్త రాజు కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాజ్ కుమార్ స్పందించి మున్సిపల్ ఎస్సై సహకారంతో ఆయాచకుడిని వికారాబాద్ మున్సిపల్ లో ఉన్న కొంపల్లి వద్ద ఉన్న వృద్ధాశ్రమంకి తీసుకెళ్లి అతనికి కటింగ్ స్నానం చేయించి మామూలు మనిషిగా చేయించారు. అతని నుండి ఇబ్బంది ఉన్నాయని స్థానిక నాయకులు రాజ్ కుమార్ కు తెలుపగా వెంటనే స్పందించి పరిష్కరించినందుకు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వికారాబాద్ జనరల్ సెక్రెటరీ ఎలుకంటి సత్యనారాయణ, మున్సిపల్ జవాన్ రాజు, మున్సిపల్ సిబ్బంది లక్ష్మయ్య, బాలయ్య, అనంతయ్య, మల్లేశము, ఓల్డ్ ఏజ్ హోం నిర్వాకులు వెంకట్ పాల్గొన్నారు