సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మున్నూరు కాపు సంక్షేమ భవన్లో సిద్దిపేట నియోజకవర్గ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుకు మున్నూరు కాపులు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తీర్మాన పత్రాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ కు అందజేశారు. సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో కొండా దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపులకు అన్ని జిల్లా కేంద్రాలను కమ్యూనిటీ హాళ్లను నిర్మించి ఇచ్చారన్నారు సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోనూ 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో మున్నూరు కాపులకు టిఆర్ఎస్ పార్టీ 12 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించిందని కాంగ్రెస్ బిజెపిలో కంటే ఎక్కువగా మున్నూరు కాపులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారన్నారు. రాజ్యసభలను మున్నూరు కాపులకు అవకాశం కల్పించా రన్నారు. సిద్ధిపేట పట్టణంలోనూ మంత్రి హరీష్ రావు మున్నూరు కాపులకు సముచిత గౌరవాన్ని ఇచ్చారన్నారు. హరీష్ రావుకు సిద్దిపేట మున్నూరు కాపు సంఘం తరఫున సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామన్నారు. మున్నూరు కాపులకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నామన్నారు ప్రతి జిల్లాలో రెండు ఎకరాల్లో మున్నూరు కాపు సంక్షేమ భవనం కోసం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయకంమల్లయ్య, కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్, అర్బన్ మండలం వైస్‌ఎంపీపీ అల్లం ఎల్లం, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాలా సాయిరాం, ఎంపీటీసీ ఆకుల హరీష్, కూర బాల్ రెడ్డీ, తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి




