హైదరాబాద్, హైదరాబాద్, మార్చి 11 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నిక నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 16న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.