ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న దేశ ప్రధాని సంతకం చేసిన రోజే భారతదేశంలో ఒక జర్నలిస్టును అరెస్టు చేయడం అత్యంత విడ్డూరమని అన్నారు.. జుబైర్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీని అందించకుండా అరెస్టు చేయడం, దిల్లీ పోలీసులు అరెస్టు చేయడానికి ముందు చివరి నిమిషంలో 41ఎ నోటీసు జారీ చేయడం ద్వారా అర్నేష్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలను అపహాస్యం చేయడం పాలక రాజకీయ ప్రమేయం బలంగా సూచిస్తోంది. దేశంలో నకిలీ వార్తలను వెలికితీసే పనిలో నిమగ్నమైన జర్నలిస్టు జుబైర్‌ని పాలక వర్గాలకు శత్రువుగా మార్చింది. జుబైర్ అరెస్టు ప్రభుత్వం సత్యం పట్ల అసహనాన్ని మరియు హక్కును నొక్కి చెప్పే విధానాన్ని ప్రదర్శిస్తుందని ఐజెయు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు అని కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి ప్రకటనలో తెలియజేసారు .