మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర

  • బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
  • అంబేడ్కర్‌ ‌రాజ్యాంగం కల్పించిన హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుంది
  • సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క

ప్రజాతంత్ర, ఖమ్మం, ఏప్రిల్‌ 14 : ‌మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించి జాతి నిర్మాణం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌పుట్టిన రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో మట్లాడుతూ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన సంగ్రామం యాత్ర ఎవరి కోసమని ప్రశ్నించారు. బండి సంజయ్‌ ‌చేపట్టిన పాదయాత్ర దేశంలో లౌకిక వాదం లేకుండా చేయడానికి, భావ స్వేచ్ఛను హరించడానికి, ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విఘాతం కలిగించ డానికి చేస్తున్న యాత్రగా ఉందని విమర్శించారు.

అచ్చేదిన్‌ ‌తీసుకువస్తానని అధికారంలోకి వొచ్చిన ప్రధాని మోడీ వంట గ్యాస్‌, ‌డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశ ప్రజలకు సచ్చే దిన్‌ ‌తీసుకువచ్చాడని బండి సంజయ్‌ ‌పాదయాత్ర చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సామాన్యులపై మోడీ సర్కార్‌ అనేక భారాలను మోపుతూ, సంపన్నులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను  మాఫీ చేసిందని ప్రజలకు పాదయాత్రలో బండి సంజయ్‌కి వివరించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా కార్పొరేట్‌ ‌సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడానికి మోడీ సర్కార్‌ ‌పరోక్షంగా సహకరిస్తున్న విషయాలను పాదయాత్రలో ప్రజలకు చెబితే బండి సంజయ్‌ ‌పాదయాత్రకు అర్థం ఉంటుందని సూచించారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల నుంచి నల్ల ధనం తీసుకొచ్చే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మాయ మాటలతో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా వీటిని అమలు చేయని మోడీ సర్కార్‌ ‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని భట్టి డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట మోడీ సర్కార్‌ అం‌బానీ ఆదానీలకు ధారాదత్తం చేస్తూ ఉద్యోగుల ఉపాధిని దెబ్బ తీస్తోందని మండిపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అయిన భారత దేశంలో భాష, మతం పేరిట విద్వేషాలను సృష్టిస్తున్న మోడీ సర్కార్‌ ‌ను ప్రశ్నిస్తున్న వారిపై రాజద్రోహం కేసు పెట్టి  అంబేద్కర్‌ ‌రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛను, బ్రతికే హక్కును బిజెపి ప్రభుత్వం హరిస్తున్నదని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page