శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్, అధికారులు
డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె అశోక్ రెడ్డి, డైరెక్టర్ బి రాజమౌళి లు పుష్పగుచ్చం, మెమెంటో లు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అదనపు సంచాలకులు కె నాగయ్య, సి ఐ ఈ రాధాకృష్ణ, జాయింట్ డైరెక్టర్ డి ఎస్ జగన్ , ఆర్ ఐ ఈ రాములు, ఉప సంచాలకులు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ, ప్రసాదరావు , సురేష్ ,మీడియా అకాడమీ సెక్రెటరీ వేంకటేశ్వర రావు ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు..