భానుడి భగభగతో.. విద్యుత్‌ ‌భారీగా వినియోగం..!

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్‌ ‌జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్‌ ‌జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు అయ్యింది.ఎండలకి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు..ఫిబ్రవరి మధ్య వరకు కూడా ఈ సారి చలి ప్రభావం కనిపించింది. ఫిబ్రవరి చివరికి వచ్చే సరికి మెళ్ల మెళ్లగా వేడి మొదలైంది. మార్చి మొదటి నుంచి చివరికి వచ్చే సరికి ఇది మరింత పెరిగింది. ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదు అవుతోంది. రాత్రి పూట కూడా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చి చివరిలోనే ఇలా ఉందంటే ఏప్రిల్‌ ‌లోకి ప్రవేశిస్తే ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎండ కారణంగా ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళ తిప్పలు అంతా ఇంతా కాదు. ఈ ఎండలకు రోడ్లపై తిరిగితే కచ్చితంగా వడదెబ్బ తగులుతుందని, అనారోగ్యానికి గురవుతారని వాతవరణ శాఖ హెచ్చరిస్తునే ఉంది. రాగల 2,3 రోజులలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్‌ ‌వరకు పెరిగే అవకాశం ఉందన్నారు.
నిన్నటి వరకు విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియర్‌ ‌తమిళనాడు వరకు కొనసాగుతోందని, సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9కిమి ఎత్తున ఉండడం మూలానా రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని,హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ తీవ్రతతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, పగటి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీడపట్టున ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ 1, 2 ‌తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో వాయువ్య జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా  ప్రభుత్వం అప్రమత్తమైంది . అన్ని జిల్లాలకు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ ‌హెచ్చరిక జారీ చేసింది.మరో 5 రోజుల పాటు దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో దేశంలో అనేక చోట్ల 45 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.అయితే మన దగ్గర ఎండలు ఇలా ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం..అమెరికా కాలిఫోర్నియాలో  1913లో 56.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సహజంగానే వేసవిలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం డీ హైడ్రేట్‌ ‌కాకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అం‌దించే ద్రావణాలు తాగాలని చెబుతున్నారు. కొబ్బరి బోండాలు తాగాలని, నీరు అధికంగా ఉండే ద్రాక్ష, పుచ్చకాయలు తినాలని సూచిస్తున్నారు.మార్కెట్‌ ‌లో దొరికే కూల్‌ ‌డ్రింక్స్ ‌కాకుండా సహజ పానీయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో నుంచి వెళ్లి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌ ‌లో నుంచి అతి చల్లని నీళ్లు ఒకే సారి తాగకుండా.. కాసేపు కూర్చొని నెమ్మదిగా నార్మల్‌ ‌వాటర్‌ ‌లేదా తక్కువ చల్లటి నీరు తాగాలని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తప్పనిసరి అయితే తప్పా బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, క్యాప్‌ ‌లేదా ఎండ నుంచి రక్షణను ఇచ్చే వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.అతినీల లోహిత(యూవీ) కిరణాలు తాకితే చర్మం దెబ్బతింటుంది. ఆ కిరణాలు మరీ ఎక్కువగా తాకితే చర్మ క్యాన్సర్‌ ‌వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.ఎండ వల్ల రెండేళ్లలో ఒకసారి చర్మం కమిలిపోయినా, చర్మ క్యాన్సర్‌ ‌వచ్చే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.90% చర్మ క్యాన్సర్లు అధిక సూర్యరశ్మి వల్లే వస్తున్నాయి.చర్మంలో మార్పు కనిపించగానే, వైద్యులను సంప్రదించాలి. చాలావరకు అది చర్మ క్యాన్సర్‌ అయ్యుండదు.ఒకవేళ క్యాన్సర్‌ అయినా కూడా.. లేత దశలో వైద్యం ప్రారంభిస్తే కోలుకునే అవకాశం మెరుగవుతుంది.మనకు సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.వేడి గాలులు చెవులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి.మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు.ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దక్షిణ భారతదేశంలో తప్ప.. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో మాత్రం ఎండలు దంచికొడతాయి.ఇక్కడ ఏప్రిల్‌ ‌నుంచి ఎండ వేడిమి అంతకంతకూ పెరుగుతుందని,రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని తెలిపింది.ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, నీటిని ఎక్కువగా తాగుతూ డీ హైడ్రేషన్‌ ‌కి గురికాకుండా వుండాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలు మండుతుండటంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో.. విద్యుత్‌ ‌వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సౌత్‌ ఇం‌డియాలో అత్యధిక విధ్యుత్త్ ‌వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.
మార్చిలోనే ఇలా ఉంటే.. ముందు ముందు విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌మరింత పెరిగే అవకాశం ఉంది.మార్చి 29వ తేదీ మంగళవారం 14 వేల 117 మెగావాట్ల పవర్‌ ‌డిమాండ్‌ ‌నమోదైంది. సాయంత్రం వరకు విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.దీంతో.. ఏప్రిల్‌, ‌మే నెలలో ఎండలు మరింత పెరగనున్నాయి. అయితే.. 18 వేల మెగావాట్ల డిమాండ్‌ ‌వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు విద్యుత్‌ ‌శాఖ అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో 13 వేల 162 మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ ‌డిమాండ్‌.ఇప్పుడు మరింత పెరుగుతోంది. దీనితో  ఇప్పటికే టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ‌విద్యుత్‌ ‌బిల్లుల పెంపు ప్రతిపాదనలను ‘ప్రభుత్వం వెంటనే వాయిదా వేసుకోవాలని, పెంచిన డెవలప్‌మెంట్‌ ‌చార్జీలు బారం అయ్యి, భానుడి కన్నేర్రతో అనుకోకుండా విధ్యుత్త్  ‌వినియోగం పెరిగిందని, ఏప్రిల్‌ ‌నుండి పెంచడం వల్ల పేదలపై ఆర్థికభారం పడుతుందనే విమర్శ సర్వత్ర వినపడుతుంది.
dr sangani malleswar
డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి,
9866255355, కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page