బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

  • ‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌
  • ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌ ‌సెంటర్‌ ఆఫ్‌ అ‌ట్రాక్షన్‌గా నిలిచిందన్నారు.. నిజానికి ఒకప్పుడు ఐటీ అంటే బెంగుళూరే. దానిని ఇండియన్‌ ‌సిలికన్‌ ‌వ్యాలీ అనేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు.. హైదరాబాద్‌ను ఐటీ సిటీగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌, ‌కర్నాటక కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌డీకే శివకుమార్‌ ‌మధ్య ట్విట్టర్‌ ‌వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. బెంగుళూరులో మౌళిక సదుపాయాలు సరిగా లేవని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్‌ ‌సీఈవో తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దానికి మంత్రి కేటీఆర్‌ ‌బదులిస్తూ.. వి•రంతా హైదరాబాద్‌కు రావొచ్చు అని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలున్నట్లు ట్వీట్‌ ‌చేశారు. ఇన్నోవేషన్‌, ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌, ఇం‌క్లూజివ్‌ ‌గ్రోత్‌పై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో తెలిపారు. అయితే ఆ ట్వీట్‌కు ఇవాళ కర్నాటక కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌డీకే శివకుమార్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. వి• ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని, మళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకురానున్నట్లు ట్వీట్‌ ‌చేశారు. ఆ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. శివకుమార్‌ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి అంతగా తెలియదని, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేనని, కానీ వి•రు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌రిప్లై ఇచ్చారు. దేశ యువత, సౌభాగ్యం కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్‌, ‌బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్‌ ‌పెడుదామని, కానీ హలాల్‌, ‌హిజాబ్‌ ‌లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *